ప్రారంభంలో భయపడ్డా.. నిజం చెప్పాలంటే..!

మహానటి సావిత్రిలా నటించడం చాలా కష్టమైన విషయం. ఆమెలా నటించానని చెప్పడం సముచితం కాదు.ఈ సినిమా కోసమే సావిత్రి నటించిన సినిమాలను చూశా.అన్ని సన్నివేశాల్లోనూ హావభావాలతో పాటు కనురెప్పలు కూడా నటిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు..అని చెప్పింది కీర్తిసురేశ్‌. ఓ ప్ర‌ ముఖ మీడియాతో ఆమె మాట్లాడుతూ”పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లోని సినిమాలో నటిస్తు న్నా.

నేను నటించిన ‘భైరవ’ సినిమా చూసి పవన్‌.. నన్ను సెట్‌లో మెచ్చుకున్నారు. తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టించేందుకు మరికొన్ని అవకాశాలు కూడా వస్తున్నాయి.గ్లామర్‌గా నటించడం ఇష్టం ఉండ దు.మరో ఐదేళ్ల తర్వాత అడిగినా ఇదే సమాధానం ఇస్తాను. ఆ విషయంలోమాత్రం చాలా స్పష్టంగా ఉన్నా అని చెప్పింది. ఇంకా..మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌లో త‌నను ఎంచుకోవ‌డంపై స్పందిస్తూ “తొలుత ‘తొడరి’ సినిమా చూసిన తర్వాత నిర్మాత నన్ను పిలిపించి మాట్లాడారు.

సావిత్రి జీవిత కథ ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అందులో సావిత్రి పాత్ర పోషించాలని అడిగారు. ప్రారంభంలో భయపడ్డా. కానీ ఆ..విషయాన్ని సవాలుగా తీసుకుని ఓకే చెప్పా. నిజం చెప్పాలంటే.. మీరు మాత్రమే ఈ పాత్రకు వంద శాతం నప్పుతారు.. అని నిర్మాత చెప్పారు. అంతేకాకుండా సావిత్రి కుమార్తె చాముండేశ్వరి కూడా అదేమాట చెప్పారు. మొదట్లో లుక్‌ టెస్ట్‌ తీశాం. వాటిని చూసిన తర్వాతే నాకు ధైర్యమొచ్చింది. అదే నమ్మకంతో నటించా” అని తెలిపిందీ  అందాల చిన్న‌ది.

Leave a comment