Movies"ఆ పాత్ర చేయడం ఇష్టం లేదు..బలవంతంగా నాతో.." సూర్య సెన్సేషనల్ కామెంట్స్..!!

“ఆ పాత్ర చేయడం ఇష్టం లేదు..బలవంతంగా నాతో..” సూర్య సెన్సేషనల్ కామెంట్స్..!!

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో సూర్యకి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సూర్య ప్రజెంట్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల పైన దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన రీసెంట్గా నటించిన సినిమా విక్రమ్ లో తన పాత్ర పై సంచలన కామెంట్స్ చేశాడు సూర్య. దీంతో ఒక్కసారిగా కోలీవుడ్ మీడియా షేక్ అయింది. లోకేష్ కనగరాజు డైరెక్షన్లో మల్టీ టాలెంటెడ్ లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా “విక్రమ్”.

ఈ సినిమా జూన్ 3 రిలీజ్ అయ్యి కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది. కష్టాల కొలిమిలో చిక్కుకున్న కోలీవుడ్ ఇండస్ట్రీకి ఊపిరి పోసింది విక్రమ్ మూవీ అనే చెప్పాలి . ఏకంగా 100 కోట్ల క్రాస్ చేసి లోకనాయకుడు కమల్ హాసన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ నెలకొల్పింది. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్రకు ఎంత పేరు వచ్చిందో 10 నిమిషాల క్యారెక్టర్ చేసిన సూర్య పాత్రకు అంతే పేరు దక్కింది. రోలెక్స్ అనే పాత్రలో సూర్య ఇరగదీసాడు. ఒక విధంగా చెప్పాలంటే సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి 50% కారణం సూర్య అంటూ అభిమానులు చెప్పుకొచ్చారు.

తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సూర్య మాట్లాడుతూ.. “నేను ఈ స్థాయిలో ఇలా నిలబడగలిగాను అంటే అందుకు కమల్ హాసన్ గారే స్ఫూర్తి. ఆయన ఫోన్ చేసి విక్రమ్ లో ఒక పాత్ర ఉందని చెప్పగానే దాన్ని వదులుకోవాలనిపించలేదు. కొన్ని పాత్రలు చేయాలంటే భయం ఉంటుంది. అసలు ఈ సినిమాలో ఈ పాత్ర నాకు నచ్చలేదని నిజంగా లోకేష్ ఫోన్ చేసి పాత్ర చేయమని అడిగితే చేయను అని చెప్పేద్దాం అనుకున్నాను అని. కానీ కమలహాసన్ గారి కోసమే నేను ఈ పాత్ర చేసాను. ఆయనతో నటించాలని నా కోరిక. ఆ కారణంగానే రోలెక్స్ పాత్ర ఇష్టం లేకపోయినా చేశానని” చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా కోలీవుడ్ మీడియా షేక్ అయింది. అంతేకాదు ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోకుండానే సూర్య నటించాడట. దీంతో సినీ ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇష్టం లేకుండా చేసినా సూర్యకు మంచే జరిగిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news