సినిమా రంగంలో హీరోయిన్ల మధ్య ఈ గోలు కామన్ గా ఉంటాయి. ఒక హీరోయిన్ స్టార్ పొజిషన్లో ఉంటే ఆమెకు పోటీగా ఉన్న హీరోయిన్లు కూడా ఆమెను క్రాస్ చేయాలని, ఆమె కంటే ఎక్కువ స్టార్ స్టేటస్ దక్కించుకోవాలని… ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆ హీరోయిన్ల మధ్య ఆధిపత్య పోరు, పంతాలు ఉంటాయి. 1980వ దశకంలో జయప్రద- శ్రీదేవి, జయప్రద – విజయనిర్మల మధ్య ఇలాంటి ఈ గోలే ఉండేవి. ఆ తర్వాత కాలంలో విజయశాంతి- రాధ మధ్య కూడా ఇలాంటి పంతాలు ఉండేవని అంటారు.
ఆ తర్వాత రోజా- రమ్యకృష్ణ మధ్య కూడా ఇలాంటి ఈగోలే కొద్ది రోజులు పాటు నడిచాయి. అయితే పాతతరం హీరోయిన్లలో మహానటి సావిత్రికి కూడా అప్పట్లో స్టార్ హీరోయిన్ల నుంచి గట్టి పోటీ ఉండేదట. సావిత్రి గొప్ప నటి. అయితే కొందరు హీరోయిన్లు తాము కూడా సావిత్రిని అందుకోవాలని ఆమెతో పోటీ పడాలని… ఆమె కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవాలని కోరుకుంటూ ఉండేవారట. అయితే దర్శక నిర్మాతలు మాత్రం సావిత్రితో పోల్చి చూస్తే మీకు అంత సీన్ లేదని హీరోయిన్లకు ఓపెన్ గానే చెప్పేసేవారట.
పాత తరం నటిమనుల్లో బి.సరోజాదేవి కూడా టాలెంట్ ఉన్న నటి. ఎన్టీఆర్ తో పాటు అప్పటి తరం స్టార్ హీరోలు అందరితో కలిసి ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. సరోజాదేవి అప్పట్లో దర్శక నిర్మాతలతో దెబ్బలాటకు దిగేవారట. షూటింగ్ కు వస్తున్నప్పుడు సావిత్రికి రెండు కార్లు ఇస్తున్నారని తనకు ఎందుకు ? రెండు కార్లు ఇవ్వరని ప్రశ్నించే వారట. తనకు కూడా సావిత్రితో పాటు మాస్‌లోను క్లాస్‌లోనూ సమానమైన ఇమేజ్ ఉందని… ఆమెకు ఇచ్చిన రెమ్యూనరేషన్‌తో పాటు అన్ని ఫెసిల్టీస్ ఇవ్వాలని సరోజాదేవి డిమాండ్ చేసేదట.
అయితే దర్శక నిర్మాతలు మాత్రం మహానటి సావిత్రికి తెలుగులో మంచి పట్టు ఉంది. నటనలో డైలాగులు చెప్పటంలో ఆమెకు ఆమె సాటి. ఆమెతో మీకు పోటీ ఏంటని చెప్పేవారట. సావిత్రి క్రేజ్ చూసి సరోజాదేవి అప్పట్లో ఈర్ష పడే వారిని కూడా అంటూ ఉంటారు. అయితే సావిత్రి మాత్రం సరోజా దేవి అంటే ఎంతో ఇష్టపడేవారట. ఆ తర్వాత కాలంలో సరోజా దేవి తమిళ్ స్టార్ హీరో ఎంజీఆర్ ను పిచ్చిపిచ్చిగా ప్రేమించారు ఆయన మాయలో పడిన తన కెరీర్‌ను సైతం దెబ్బతీసుకున్నారు.
అప్పట్లో సావిత్రి బాగా సంపాదించేవారు. ఈ క్రమంలోనే ఆమె ఎన్నో వజ్రాలు.. వైడూర్యాలు కూడా సంపాదించుకున్నారు. ఓ భారీ నగను సరోజాదేవికి ఉంచమని ఇచ్చారట సావిత్రి. ఆ నగ ఎంత విలువైంది అంటే ఆ ఒక్క దాంతోనే ఒక జీవితం అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అట. అయితే ఆ తర్వాత కాలంలో సరోజాదేవి అబద్ధం ఆడి ఆ నగను నువ్వు నాకు ఇవ్వలేదని సావిత్రితో వాదనకు దిగారట.
సావిత్రి తాను తాగిన మైకంలో ఉన్నా… ఆ నగ ఇచ్చినది నిజం అని పదే పదే చెప్పినా సరోజ దేవి మాత్రం నగ ఇవ్వలేదని అబద్ధం ఆడారన్న ప్రచారం కూడా అప్పట్లో గట్టిగా నడిచింది. అయితే చాలామంది మాత్రం సావిత్రికి ఎప్పుడు అబద్ధం ఆడే అలవాటు లేదని… ఆవిడ తన ఆస్తి అంతా ఎన్నో గుప్తదానాలకు ఇచ్చారని చెబుతూ ఉంటారు. అలా ఆ నగ విషయంలో కూడా సరోజాదేవి, సావిత్రి మధ్య కొంత వార్ అయితే నడిచిందట.