సినీ ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉంటారు. సమయం సరిపోక కావచ్చు.. లేక కథ నచ్చక కావచ్చు.. రీజన్ ఏదైనా కానీ ఒక హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేసి హిట్ కొడితే ఆ బాధ చాలా కష్టంగా ఉంటుంది . మరి అదే సినిమాను వేరే హీరో చేసి ఫ్లాప్ సంపాదించుకుంటే.. ఆ ఆనందం చెప్పలేం. లోపల ఆనందంగానే ఉన్నా బయటికి పాపం అనుకుంటూ ఉంటాం. ఇలాంటి ఎంజాయ్ ని అనుభవిస్తున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్.
మనకు తెలిసిందే వరుణ్ తేజ్ మెగా ట్యాగ్ ను వాడుకుంటూ సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడు . ఆఫ్ కోర్స్ ఇప్పటికీ నాన్న పేరు , పెదనాన్న పేరు చెప్పుకుంటూ సినీ ఇండస్ట్రీలో బ్రతికేస్తున్నాడు. అయితే తను ఎప్పటినుంచో మెగాస్టార్ చిరంజీవితో నటించాలని కోరుకుంటున్నాను అని పబ్లిక్ గానే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోచాడు వరుణ్ తేజ్. కాగా తీరా అవకాశం వచ్చినా టైం బాగోలేక ..అవకాశం చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. రీసెంట్ గా మెగాస్టార్ నటించి విడుదలైన సినిమా గాడ్ ఫాదర్ . ఈ సినిమాను మోహన్ రాజా తెరకెక్కించాడు . దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
అయితే ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటించాడు . నిజానికి సల్మాన్ ఖాన్ రోల్ లో ముందు అనుకున్న హీరో వరుణ్ తేజ్ . మెగాస్టార్ ఈ రోల్ వినగానే ఎవరైనా మెగా హీరో= చేత చేపించాలి అనే ఆలోచన రాగానే టక్కున ఆయనకు గుర్తొచ్చింది వరుణ్ తేజ్ అట . అయితే మోహన్ రాజా మాత్రం మెగా హీరో వద్దు అంటూ పట్టు బట్టి బాలీవుడ్ హీరోని పెడదామని ఆలోచించి ఆ తర్వాత అన్ని పేర్లు ఆలోచించక ఫైనల్ గా సల్మాన్ ఖాన్ ను సెలెక్ట్ చేశారట .
ఇంత చేసినా అక్కడ సల్మాన్ ఖాన్ రోల్ కి వచ్చిన పాపులారిటీ ఏమీ లేదు. గాడ్ ఫాదర్ సినిమాలో బిస్కెట్ రోల్ అని ట్రోల్స్ చేశారు జనాలు. దీంతో మెగా హీరో ట్రోల్స్ నుంచి తప్పించుకున్నాడని సంబరపడాలో.. మెగాస్టార్ తో నటించే అవకాశం మిస్ అయ్యారని బాధపడాలో తెలియట్లేదు. అంతేకాదు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కొంచెం హెడ్ వెయిట్ చూపించాడని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ప్రమోషన్ టైమ్స్ లో కూడా సల్మాన్ ఖాన్ ఓవర్ చేసాడని అంత తలపోగురు పనికిరాదని చెప్పుకొచ్చారు.