సినిమా రంగంలో హీరోయిన్లపై లైంగీక వేధింపులు చాలా మామూలుగా ఉంటాయి. అవకాశాల కోసం హీరోయిన్లను వాడుకోవడం అనేది ఇప్పటి నుంచే కాదు.. గత కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తూనే వస్తుంది. 1989వ దశకంలో హీరోయిన్లు కూడా ఇష్టపూర్వకంగానే అవకాశాల కోసం ఏదైనా చేసేందుకు ఓకే చెప్పేవారు. అయితే ఇప్పుడు అంతా మారిపోయింది. ఈ సోషల్ మీడియా యుగంలో ఎవరు కూడా వెనక్కు తగ్గటం లేదు.
నార్త్ నుంచి సౌత్ వరకు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా కాస్టింగ్ కౌచ్ పేరుతో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఓపెన్ అవుతున్నారు. తెలుగులో శ్రీరెడ్డి – కోలీవుడ్లో సింగర్ చిన్మయి – నార్త్ లో కంగనా రనౌత్ లాంటివాళ్ళు కాస్టింగ్ కౌచ్ పై ధైర్యంగా తమ ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పారు. ఆ తర్వాత ఒక్కొక్కరు బయటకు వస్తూ తమ కెరీర్లో ఛాన్సులు కోసం ఎలాంటి లైంగిక వేధింపులకు గురయ్యామో చెబుతున్నారు.
గతంలో సీనియర్ హీరోయిన్గా ఉన్న భానుప్రియకు సైతం ఈ ఇబ్బందులు తప్పలేదన్న ప్రచారం అప్పట్లో ఉండేది. అయితే ఇదే విషయాన్ని ఓ సీనియర్ సినీ జర్నలిస్టు తాజాగా ప్రస్తావిస్తూ ఆ హీరో భానుప్రియ డ్యాన్సులు, నటనలో తనను డామినేట్ చేస్తుందనే తన సినిమాల్లో ఆమెను హీరోయిన్గా ఇష్టపడేవారు కాదని చెప్పారు. అందుకే ఆ స్టార్ హీరో మరో ఇద్దరు హీరోయిన్లనే తన సినిమాల్లో హీరోయిన్లుగా పెట్టుకోవాలని రికమెండ్ చేసేవారని కూడా చెప్పారు.
ఇక మరో టాక్ ప్రకారం ఆ స్టార్ హీరోతో పాటు మరో స్టార్ ప్రొడ్యుసర్ ఇద్దరూ కలిసి భానుప్రియను లైంగీకంగా వేధించేవారని… అందుకే ఆమె ఇష్టపడకపోవడంతోనే ఆమెకు టాలీవుడ్లో సరైన ఛాన్సులు రాకుండా తెరవెనక చక్రం తిప్పారన్న టాక్ అయితే ఉండేది. అందుకే భానుప్రియకు అందంతో పాటు అభినయం, డ్యాన్సుల్లో స్టార్ హీరోలతో పోటీపడేంత మంచి టాలెంట్ ఉన్నా ఆమె అనుకున్నంత స్టార్ హీరోయిన్ కాకపోవడానికి అదే కారణమన్న గుసగుసలు ఉన్నాయి. మరి ఇందులో వాస్తవ, అవాస్తవాలు ఏంటో వాళ్లకే ఎరుక..!