Moviesకూతురు మీద నీచమైన కామెంట్స్.... అయినా మోహన్ బాబు మౌనం ఎందుకంటే...!

కూతురు మీద నీచమైన కామెంట్స్…. అయినా మోహన్ బాబు మౌనం ఎందుకంటే…!

టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీ గురించి ఎప్పుడూ ఏదో రకమైన కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తూనే ఉంటాయి. అంతేకాదు, గర కొన్నేళ్ళుగా మంచి హీరోలైన మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌లకి హిట్స్ లేవు. చేస్తున్న సినిమాలన్నీ వరూగా ఫ్లావుతున్నాయి. పాన్ ఇండియా లెవల్‌లో చేసిన సినిమాలు ఏ రేంజ్‌లో డిజాస్టర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మోహన్ బాబు గత చిత్రం సన్నాఫ్ ఇండియా గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మోహన్ బాబు కెరీర్ మొత్తంలో ఇంత భారీ డిజాస్టర్ మరొకటి లేదనే చెప్పాలి. ప్రస్తుతం మనోజ్ అహం బ్రహ్మాస్మి అనే పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మొదలై దాదాపు మూడేళ్ళు కావస్తుంది. ఇంకా ఏ స్టేజ్‌లో ఉందో కూడా తెలియడం లేదు. అసలు రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయా అనేది కూడా సందేహంగానే ఉంది. ఇక విష్ణు జిన్నా అని మరో ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ ఆయనకి చాలా కీలకం.

 

మంచు హీరోల సినిమాల విషయం అలా ఉంచితే మంచు ఫ్యామిలీలో హీరోలా దూసుకొచ్చిన లక్ష్మీ ప్రసన్న ఇటీవల కాలంలో అంతగా కనిపించడం లేదు. హీరోయిన్‌గా సినిమాలు చేసి ఆకట్టుకుంది. టాక్ షోస్‌తోనూ తన మార్క్ చూపించి అందరి ప్రశంసలు అందుకుంది. అయితే, ఈ మధ్య మంచు లక్ష్మీ అటు సినిమాలలో కనిపించడం లేదు. ఇటు టాక్ షోస్ కూడా ఏమీ లేవు.

దీనికి కారణం సోషల్ మీడియాలో లక్ష్మీ గురించి రక రకాల పిచ్చి కామెంట్స్ పెట్టడంతో పాటు తనకి సంబంధించిన కొన్ని గ్లామర్ పిక్స్‌ను వైరల్ చేస్తూ న్యూసెన్స్ కామెంట్స్ చేయడమే. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మంచు లక్ష్మీ ఫొటోలనే పెట్టి కింద రాస్తున్న కామెంట్స్ చూస్తే అసహ్యం కూడా వేస్తుంది. అయినా మోహన్ బాబు ఇలాంటి వాటికి పెద్దగా రియాక్ట్ కావడం లేదు. కారణం తన కూతురు చేస్తున్న నిర్వాకమే అలా ఉంది. ఇక కామెంట్స్ చేసే వారు చేయకుండా ఎలా ఉంటారు అని తనలో తనే సర్ది చెప్పుకుంటున్నారా ? అన్న ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news