సినీ రంగంలో అన్నగారితో అత్యంత చనువున్న నటుల్లో హాస్య నటుడు.. హాస్య నట చక్రవర్తి.. రేలంగి వెంకట్రామయ్య ఒకరు. అసలు.. అన్నగారికి అవకాశాలు మెండుగా రావడం వెనుక.. రేలంగి ఉన్నారనేది వాస్తవం అంటారు గుమ్మడి వెంకటేశ్వరరావు. మిస్సమ్మ, పాతాళ భైరవి వంటి సినిమాల్లో అన్నగారు నటించే సమయానికి అగ్ర నటుల జాబితాలో రేలంగి ముందున్నారు. ఆయనకు ఆర్థికంగా.. అత్యంత జాగ్రత్త ఎక్కువ. దీంతో స్టూడియో యజమానులు సైతం.. ఆయనకు కొన్ని బాధ్యతలు అప్పగించేవారు.
ఇలా.. వచ్చిన అవకాశాల నేపథ్యంలోనే.. రేలంగి అనేక మంది నటీనటులను తెరకు పరిచయం చేశారు. ఈ క్రమంలోనే రేలంగికి – ఎన్టీఆర్‌కు మధ్య అవినాభావ సంబంధం పెరిగింది. కుటుంబ విషయాలను చర్చించుకునే స్థాయివరకు కూడా.. రేలంగి-ఎన్టీఆర్ సంబంధాలు పెరిగాయి. ఆస్తుల విషయం.. ఫ్యూచర్ విషయంలోనూ.. ఇరువురూ.. తమ అభిప్రాయాలు పంచుకునేవారు.. జాగ్రత్తలు చెప్పుకొనేవారట. ఎక్కడ ఏమాత్రం తీరిక దొరికినా అన్నయ్యా అంటూ..రేలంగి.. ఎన్టీఆర్ ఇంటికి వెళ్లేవారట.
ఇలా.. ఇరువురి మధ్య అన్యోన్య సంబంధాలు నెలకొన్నాయి. ఇక, కొన్నాళ్లకు.. రేలంగి ఓ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డారట. నిజానికి అప్పటికే ఆయనకు సత్యనారాయణ కుమారుడు పెరిగిపెద్దయి.. వ్యాపారం లోనూ ఉన్నారు. అయినా.. ఒక హీరోయిన్‌తో రేలంగి ప్రేమలో పడ్డారు. అయితే.. ఆయనను ఆర్థికంగా వాడుకున్న తర్వాత.. ఆమె మరొకరి ప్రేమలో పడిందట. ఈ విషయం నిలదీసేందుకు వెళ్లిన రేలంగిపై చేయిచేసుకున్నట్టు గుమ్మడి రాసుకొచ్చారు.
ఈ క్రమంలోనే ఒకనాటి రాత్రి ఘర్షణ జరిగిన తర్వాత.. నేరుగా.. అన్నగారి ఇంటికి వెళ్లిన రేలంగి..`అన్న య్యా.. “ అంటూ.. తన గోడు వెళ్లబోసుకున్నారట. దీంతో సదరు హీరోయిన్ చేసిన పనికి అన్నగారు సైతం అవాక్కయి.. అయినా.. ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనేనా ఇది! అని రేలంగినే మందలించారట. అదే సమయంలో తెరచాటున సదరు హీరోయిన్ను ఇరుకున పెట్టేలా అన్నగారు వేసిన వ్యూహంతో అనతి కాలంలోనే ఆమెకు అవకాశాలు తగ్గిపోయి.. చివరకు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని గుమ్మడి రాసుకొచ్చారు.