Moviesబలవంతంగా ఆ పని చేయించారు..స్టార్ హీరో పై రకుల్ సంచలన కామెంట్స్..!?

బలవంతంగా ఆ పని చేయించారు..స్టార్ హీరో పై రకుల్ సంచలన కామెంట్స్..!?

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం . ఇది ఓ రంగుల ప్రపంచం. ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరికీ తెలియదు . ఊసరవెల్లి తన రంగులు మార్చిన్నట్టు సినిమా ఇండస్ట్రీలో.. క్షణానికి ఓ రంగు మార్చే నటీనటులు చాలామంది ఉంటారు. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ హీరోయిన్ రకుల్ తో బలవంతంగా లిప్ కిస్ పెట్టించారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

“వెంకటాద్రి ఎక్స్ప్రెస్” సినిమాతో తెలుగు సినీతెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్. సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బడా బడా హీరోలతో నటించే అవకాశం కొట్టేసి.. స్క్రీన్ స్పేస్ సంపాదించుకొని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. ఇక తర్వాత టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తో కోలీవుడ్ లో కూడా ఆఫర్లు కొట్టేసింది. అమ్మడు అదృష్టమో లేక కంటెంట్ బావుందో తెలియదు కానీ.. కోలీవుడ్ లో కూడా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. దీంతో అమ్మడుకు బాలీవుడ్ ఆఫర్లు రావడంతో కోలీవుడ్ , టాలీవుడ్ ను వదిలేసి ఏకంగా బాలీవుడ్ వైపు అడుగు వేసింది. అక్కడ కూడా కెరియర్ మొదట్లో మంచి సినిమాలు పడి హిట్ సంపాదించుకున్నా.. ప్రజెంట్ వచ్చిన పాత్రలతో మెప్పిస్తుంది.

కాగా ఈ క్రమంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరో తో రకుల్ లిప్ లాక్ చేసిన సీన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ సినిమా రిలీజ్ అయిన కొత్తలో ఏకిపారేసారు రకుల్ ని జనాలు. “ఇలాంటి ఘాటు లిప్ లాక్ ఇస్తావా ..? తెలుగు హీరోలతో ఏ రోజైనా ఇలా చేసావా..?” అంటూ దుమ్మెత్తి పోశారు. అయితే నిజానికి ఆ సీన్ డైరెక్టర్ ఆమెకు కథ చెప్పేటప్పుడు వివరించలేదట. కానీ షూటింగ్ టైం రోజు లిప్ లాక్ సీన్ ఉందని రెడీగా ఉంమంటూ చెప్పు వెళ్లిపోయారట . అంతేకాదు ఆమె చేయను అని చెప్పేసరికి డైరెక్టర్ బ్లాక్ మెయిల్ చేశారట . బాలీవుడ్ లో ఇలాంటివన్నీ చేస్తేనే నువ్వు హీరోయిన్గా ఎదగగలవు అంటూ ఆమెను బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా ఈ లిప్ లాక్ సీన్స్ లో నటించేలా చేసారట. దీంతో ఇదే విషయం అప్పట్లో సంచలనంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news