Moviesఅన్‌స్టాప‌బుల్ 2 ఫ‌స్ట్ ఎపిసోడ్‌లో బాబు, లోకేష్‌తో న‌ట‌సింహం ర‌చ్చే... బ్రాహ్మ‌ణి...

అన్‌స్టాప‌బుల్ 2 ఫ‌స్ట్ ఎపిసోడ్‌లో బాబు, లోకేష్‌తో న‌ట‌సింహం ర‌చ్చే… బ్రాహ్మ‌ణి ఎంట్రీ హైలెట్‌… (వీడియో)

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య టాక్ షో అన్‌స్టాప‌బుల్ ప్రి రిలీజ్ ఈవెంట్ ఈ రోజు విజ‌య‌వాడ‌లో భారీ ఎత్తున జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ సీజ‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు అంద‌రూ సీజ‌న్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ? అని అత్యంత ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా సీజ‌న్ 2లో ఫ‌స్ట్ ఎపిసోడ్‌పై అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఫ‌స్ట్ ఎపిసోడ్లోనే బాల‌య్య అదిరిపోయే గెస్టుల‌ను తీసుకు వ‌స్తున్నారు.

బాల‌య్య‌కు బావ అయిన మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో పాటు స్వ‌యానా బాల‌య్య అల్లుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఇద్ద‌రూ కూడా ఫ‌స్ట్ ఎపిసోడ్ గెస్టులు కానున్నారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ తాలూకా షూట్ జరుగుతుందట. అంతే కాకుండా ఈ ఎపిసోడ్ లోనే మ‌రో అదిరిపోయే ట్విస్ట్ కూడా చోటు చేసుకోనుంది. చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ కూడా క‌నిపించ‌నున్నాడు.

ఓ వైపు బావ‌, అటు అల్లుడుతో బాల‌య్య ఎపిసోడ్ అంటే మామూలు ర‌చ్చ ఉండ‌దు. లోకేష్‌పై అయితే ఓ స్ట‌న్నింగ్ స్పెష‌ల్ ఎంట్రీ కూడా ప్లాన్ చేశార‌ట‌. చివ‌ర్లో బ్రాహ్మ‌ణి ఎంట్రీ కూడా హైలెట్‌గా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అయితే చంద్ర‌బాబు మీద షూట్ చేస్తోన్న వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ప‌క్క‌నే ప్రేక్ష‌కులు సీఎం సీఎం అంటూ నినాదాలు హోరెత్తిస్తున్నారు. ఏదేమైనా ఫ‌స్ట్ ఎపిసోడ్‌తోనే సీజ‌న్ 2ను గ‌త్త‌ర లేపే రేంజ్‌లో బాల‌య్య చేసేందుకు రెడీ అయిపోతున్నాడు.

https://www.facebook.com/1033988888/videos/1338581526677224/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news