సినీ ఇండస్ట్రీ లోకి వచ్చాక మనం నలుగురు మాట్లాడే మాటలను పెద్దగా పట్టించుకోకూడదు . మన పని మనం చేసుకుంటూ పోవాలి . అలా ఉంటేనే ఈ సమాజంలో మనం బ్రతకగలం. కేవలం సినీ ఇండస్ట్రీ అనే కాదు సోషల్ మీడియాలోకి వచ్చాక కూడా అంతే. ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీలే కాదు సామాన్య ప్రజలు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇంట్లోని ఆడవారు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి తమ ఇంట్లోని హోమ్ టూర్ అని, పూజగది డెకరేషన్ అని, తమ హెల్త్ కు సంబంధించిన టిప్స్ అని., ప్రెగ్నెన్సీ కి సంబంధించిన మ్యాటర్స్ అంటూ బోలెడు కంటెంట్ ఇస్తున్నారు.
వీళ్లల్లో చాలామంది నెగటివ్ ట్రోలింగ్ కి గురవుతున్నారు . అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టే ముందే మనం ఇలాంటి ట్రోలింగ్ లు ఉంటాయని గమనించి ఎదుటివారు ఏం మాట్లాడినా.. మనం పట్టించుకోకూడదనే విషయాన్ని లైట్ గా తీసుకుంటే మన లైఫ్ సక్సెస్ అవుతుంది. పక్క వాళ్ళు ఏదో అన్నారు కదా అంటూ మనం బాధపడుతూ.. కూర్చుంటే ముందుకెళ్ళలేం.
కాగా ఇదే విషయాన్ని మనం సినీ ఇండస్ట్రీలో ఉండే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతిలోనూ చూడవచ్చు. మిగతా ఆర్టిస్టుల్లో కూడా ఇలాంటివి స్పోర్టివ్ నెస్ ఉంటుంది. కానీ ప్రగతిలో మాత్రం ఇలాంటి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. తనదైన స్టైల్ లో సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .సినిమాల్లో తనదైన స్టైల్ లో నటిస్తూ హీరోయిన్స్ కు అమ్మగా హీరోకు తండ్రిగా పక్కింటి ఆంటీ పాత్రలో నటిస్తూ మెప్పించింది. కాగా కరోనా లాక్ డౌన్ టైం నుంచి ప్రగతిలోని కొత్త యాంగిల్ ని జనాలు చూస్తున్నారు.
మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె పెట్టే వర్కౌట్ వీడియోస్, ఫోటోషూట్స్ ,చేసే అల్లరి.. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ గానే ఉంటుంది . అయితే దీనికి సంబంధించి నెగటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఫ్యూచర్ లో ట్రోలింగ్ జరుగుతాయి. ఆమె బాడీ షేప్స్ పై బాడీ పార్ట్స్ పై పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఏనాడు ప్రగతి అలాంటి వారిపై టంగ్ స్లిప్ అవ్వలేదు. సోషల్ మీడియాలోకి అడుగుపెట్టాక ఇలాంటివన్నీ కామన్. అన్నింటికి నేను సిద్ధం అంటూ ఆమె పని ఆమె చేసుకుంటూ పోయింది.. తప్పిస్తే మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల నేను కేసులు పెడతాను ..నేను కోర్టుకి వెళ్తాను అంటూ విర్ర వీగలేదు. దీంతో ప్రగతి మైండ్ సెట్ పై కుర్రాళ్ళు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మీలాగే ఉండాలి ప్రగతి ఆంటీ సోషల్ మీడియాలో మీలాంటి వారు ఉంటేనే మజా అంటూ హైప్ చేస్తున్నారు . మనకు తెలిసినదే సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చిన ప్రగతి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో సరిపెట్టుకుంటుంది.