Moviesతూచ్: మేం విడాకులు తీసుకోవట్లేదు..స్టార్ డాటర్ కు బిగ్ రిలీఫ్..!?

తూచ్: మేం విడాకులు తీసుకోవట్లేదు..స్టార్ డాటర్ కు బిగ్ రిలీఫ్..!?

మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో “విడాకులు” అనే పదం ఎంత కామన్ గా వినిపిస్తుందో. మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ విడాకులనే పదానికి అలవాటు పడిపోయారు. కొత్తగా పెళ్లి చేసుకున్న న్యూ కపుల్స్ నుంచి పెళ్లి చేసుకున 25 సంవత్సరాలు అయినా ఓల్డ్ కపుల్స్ వరకు అందరు కూడా విడాకులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకుంటున్న స్టార్ జంటలు ఎక్కువైపోతున్నారు.

కాగా ఇలాగే “మేము విడాకులు తీసుకుంటున్నామంటూ అఫీషియల్ గా ప్రకటించింది కోలీవుడ్ స్టార్ డాటర్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య హీరో ధనుష్ మనకు తెలిసిందే. వీరిద్దరి పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా కానీ వీరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు.. తీసుకోవాలని నిర్ణయించుకున్నారు . ఇదే విషయాన్ని అభిమానులకు మీడియా మిత్రులకు అఫీషియల్ గా తెలియజేశారు . మేము విడిపోతున్నాం భార్యాభర్తలు లేకపోయినా ఫ్రెండ్స్ గా ఉంటామంటూ అఫీషియల్ గా ప్రకటించారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ జంట విడాకులు తీసుకోవాలనే నిర్ణయం నుంచి వెనక్కి తగినట్లు తెలుస్తుంది . దానికి కారణం పిల్లల భవిష్యత్తు. రీసెంట్ గా కౌన్సిలింగ్ తీసుకున్న ఈ జంట పిల్లల భవిష్యత్తు కోసం తమ విడాకులు తీసుకోవాలని నిర్ణయాన్ని క్యాన్సిల్ చేసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . దీంతో మళ్లీ మనం ఐశ్వర్య ధనుష్ ని కలిసి భార్యాభర్తలుగా చూడబోతున్నాం అన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇదే విషయాన్ని మరికొద్ది రోజుల్లో ఈ జంట ఓ భారీ ఈవెంట్లో చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఇదేవిధంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య కూడా కలిస్తే బాగుండు అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి ధనుష్ ఐశ్వర్య ఎంత మేరా సమంత నాగచైతన్య నిర్ణయాని మార్చగలరో..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news