టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు నాగచైతన్య ఈ మధ్య ఏం చేసిన సంచలనం గానే ఉంది. అంతకుముందు నాగచైతన్య పేరును పట్టించుకునే జనాభానే లేరు. ఏనాడైతే సమంతతో లవ్ అంటూ పాపులర్ అయ్యాడో.. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఈయన పేరు మారుమ్రోగిపోతుంది, సమంత భర్తగా.. నాగార్జున కొడుకుగానే పాపులర్ అయిన నాగచైతన్య సొంత టాలెంట్ తో ఎప్పుడు పాపులర్ అవుతారు చూడాలి.
కాగా ఈ మధ్యకాలంలో నాగచైతన్య పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దానికి కారణం సమంతతో విడాకులు తీసుకోవడమే.. ఏనాడైతే ఆయన సమంత విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారో ఆనాటి నుంచి నాగచైతన్య పేరు సోషల్ మీడియాలో రేంజ్ లో వైరల్ గా మారింది . అయితే వీళ్ళు విడాకులు ప్రకటించి దాదాపు సంవత్సరం కావస్తుంది ..అయినా కానీ వీళ్ళపై నెట్టింట వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగా రీసెంట్గా నాగచైతన్య చేసిన ట్వీట్ మరోసారి సంచలనంగా మారింది.
నాగచైతన్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లవ్ స్టోరీ మూవీ రిలీజై నేటికీ ఏడాది కావస్తుంది. దీంతో ఈ సినిమా షూటింగ్ టైంలో మెమోరీస్ ని గుర్తు చేసుకున్న నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఆయన ఏం రాసుకోచ్చాడంటే..” ఇలాంటి స్పెషల్ చిత్రాన్ని నాకు అందించిన చిత్ర యూనిట్ కి బ్లాక్ బస్టర్ హీట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్రం నాకు ఎన్నో విషయాలు నేర్పించింది ..లవ్ స్టోరీ సినిమా జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను.. నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను” అంటూ చైతన్య ట్విట్ చేశాడు. దీంతో లవ్ స్టోరీ సినిమా హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది.
Thank you so much to the entire team and audience for making this one special ! A film that taught me in so many ways .. memories I will always cherish https://t.co/gGWbzmZbT0
— chaitanya akkineni (@chay_akkineni) September 24, 2022