Moviesబాల‌య్య అలా... చిరు ఇలా... టాలీవుడ్‌లో ఒక్క‌టే హాట్ టాపిక్‌...!

బాల‌య్య అలా… చిరు ఇలా… టాలీవుడ్‌లో ఒక్క‌టే హాట్ టాపిక్‌…!

మెగాస్టార్ చిరంజీవి – నటసింహం బాలకృష్ణ ఇద్దరు కూడా టాలీవుడ్ లో నాలుగు దశాబ్దాలుగా స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. 60 ఏళ్లు దాటుతున్న కూడా చిరంజీవి, బాలయ్య ఇద్దరిలోనూ ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వెళ్లి 10 ఏళ్ల తర్వాత తిరిగి సినిమాల్లోకి రీయంట్రి ఇచ్చినా ఆయనలో జోష్ ఏమాత్రం తగ్గలేదు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు సూపర్ హిట్ కొట్టారు. వివి. వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో చిరంజీవి డ్యాన్సులు చూసిన తెలుగు సినీ అభిమానులు అందరూ ఆయనలో గ్రేస్ ఏమాత్రం తగ్గ లేదని ప్రశంసలు కురిపించారు.

ఆ తర్వాత చిరంజీవి నటిస్తున్న ప్రతి సినిమాలోని ఇతర స్టార్ హీరోలకు చోటు ఇవ్వడం మొదలుపెట్టారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ గురువు పాత్రలో నటించారు. అలాగే కీలకపాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి, కన్నడ హీరో కిచ్చ సుదీప్ నటించారు. భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన సైరా అంచనాలు అందుకోలేదు. ఆ తర్వాత తన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి అసలు అపజయమే ఎరగని కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేశారు.

రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆచార్య సినిమా డిజాస్టర్ అయింది. విచిత్రం ఏంటంటే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నటించిన తొలి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర ఆచార్య డిజాస్టర్ అయింది. ఇక త్వరలో రిలీజ్ కానున్న లూసిఫర్ రీమేక్‌ గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమాపై పెద్దగా బజ్‌లేదు. అలాగే వాల్తేరు వీర‌య్య‌ సినిమాలో రవితేజ లాంటి నటుడు ఉన్నా కూడా ఈ సినిమాపై కూడా అంత హైప్ అయితే లేదు.

ఇక భోళాశంకర్ సినిమాలోని మరో యంగ్ హీరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటిస్తున్న కీర్తి సురేష్ కు భర్తగా సదరు యంగ్ హీరో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వయసులో దూసుకుపోవాల్సిన చిరంజీవి ఇలా తన సినిమాల్లో స్టార్ హీరోలకు ఎందుకు ? చోటు ఇస్తున్నారు. ఆ అవసరం ఆయనకు ఎందుకు వస్తుంది అన్న చర్చలు ఇండస్ట్రీ వర్గాల్లో మొదలయ్యాయి. చిరు సింగిల్‌గా నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా సూపర్ హిట్ అయింది. అమితాబ్ – విజయ్ సేతుపతి – సుదీప్ లాంటి వాళ్ళు ఉన్న సైరా సరిగా ఆడలేదు.

ఇక రామ్ చరణ్ నటించిన కూడా ఆచార్య డిజాస్టర్ అయింది. ఇక చిరంజీవికి పోటీగా ఉన్న సీనియర్ హీరో బాలకృష్ణ ఎప్పటికీ సోలోగా సై అంటున్నారు. పైగా అఖండ లాంటి వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ఆయన హిట్లు కొడుతున్నారు. బాలయ్య కొత్త కథలు ఎంచుకుంటూ కొత్త దర్శకులతో ప్రయోగాలు చేస్తూ సోలోగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇందుకు విరుద్ధంగా చిరంజీవి ఏమాత్రం అంచనాలు లేని దర్శకులతో సినిమాలు చేస్తూ రీమేకుల్లో నటిస్తుండటం చిరంజీవి హార్డ్ కోర్ అభిమానులకు కూడా నచ్చటం లేదు. మెగాస్టార్ ఉండగా సినిమాలో మరో స్టార్ అవసరమా అని ఫ్యాన్స్ వాపోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news