సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం . ఈ గ్లామర్ ఫీల్డ్ లో అందంగా ఉండాలని.. అందంగా కనిపించాలని.. ప్రతి హీరోయిన్ కోరుకుంటుంది. అలాగే సినీ ఇండస్ట్రీలోకి బాలనటిగా ఎంటర్ అయ్యి ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న స్టార్స్ కూడా అలానే చేస్తారు. అయితే ఈ క్రమంలోనే దృశ్యం బ్యూటీ ఎస్తేర్ అనీల్ తన అందం పెంచుకోవడానికి చేస్తున్న చెత్త పని గురించి సోషల్ మీడియాలో లిక్ అయ్యి వైరల్ గా మారింది.
ఎస్తేర్ అనీల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలు మలయాళ సినిమాలలో నటించి తన నటనకు మంచి గుర్తింపు సంపాదించుకుంది. చైల్డ్ యాక్ట్రెస్ గా మంచి మార్కులు వేయించుకుంది. అయితే ప్రజెంట్ ఈ అమ్మడు సినిమాలో హీరోయిన్గా అవకాశాల కోసం ట్రై చేస్తుంది. అందుకే చిన్న వయసులోనే భారీ నిర్ణయాలు తీసుకుంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి అవుతుంది.
ఎస్తేర్ అనిల్ తన అందాన్ని పెంచుకోవడానికి అందంగా కనిపించడానికి పలు రకాల ట్రీట్మెంట్లు తీసుకుంటుందట . ఈ క్రమంలో అమ్మడు తన బాడీ షైన్ అవ్వడానికి మెరుపు గా కనిపించడానికి పలు రకాల మందులు వాడుతుందట .ఆ మెడిసిన్స్ వేసుకోవడం ద్వారా ఆమె చర్మం మరింత నిగారిస్తుందని ఆమె నమ్మి తన లైఫ్ ని రిస్క్ లో పెడుతుంది అంటున్నారు జనాలు. అంతేకాదు చిన్న వయసులోనే హీరోయిన్ అవ్వాలనే తన అత్యాశ చూసి షాక్ అయిపోతున్నారు సినీ నటిజన్స్. దీంతో అందం కోసం అందం పెంచుకోవడం కోసం ఇలా టాబ్లెట్లు వేసుకోవడం అది కూడా ఇంత చిన్న వయసులో తప్పు అంటున్నారు జనాలు. మరి చూడాలి ఈ పాప ఏం చేస్తుంది..?