నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్లో ఇప్పటి వరకు 106 సినిమాలు చేశాడు. ఈ సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. చాలా మంది హీరోయిన్లతో బాలయ్యది హిట్ ఫెయిర్. ఇక రోజా – బాలయ్య కాంబినేషన్ అంటేనే అప్పట్లో తిరుగులేని క్రేజ్ ఉండేది. వీరిద్దరిని తెరమీద చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపేవారు. వీరి కాంబినేషన్లో మొత్తం 7 సినిమాలు వచ్చాయి.
బాలయ్య – రోజా కాంబోలో 1994లో భైరవద్వీపం, గాండీవం, బొబ్బిలిసింహం – 1995లో మాతోపెట్టుకోకు –
1996లో శ్రీకృష్ణార్జున విజయం – 1997లో పెద్దన్నయ్య – 1999లో సుల్తాన్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల్లో 1994లో వచ్చిన భైరవద్వీపం బాలయ్య కెరీర్లో తొలి జానపద సినిమా. ఇది సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత బొబ్బిలి సింహం కూడా సూపర్ హిట్. ఒకే యేడాది రోజాతో మూడు సినిమాలు చేస్తే అందులో రెండు సూపర్ హిట్ అయ్యాయి.
అందులో ఒకటి జానపదం, రెండోది యాక్షన్ మూవీ. భైరవద్వీపంకు సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు. బొబ్బిలిసింహంకు కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత మాతో పెట్టుకోకు, శ్రీ కృష్ణార్జున విజయం సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు ప్రయత్నాల పరంగా మెప్పించినా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత పెద్దన్నయ్య, సుల్తాన్ రెండు సినిమాలు కొన్ని వర్గాల ప్రేక్షకులకు పిచ్చ పిచ్చగా నచ్చేశాయి.
అప్పట్లో బాలయ్య – రోజా కాంబినేషన్ అంటే జనాల్లో కూడా ఓ క్రేజ్ ఉండేది. ఇటీవల రోజా జబర్దస్త్ షో నుంచి బాలయ్యకు కాల్ చేసినప్పుడు కూడా బాలయ్య గారు మళ్లీ మనం కలిసి ఎప్పుడు చేద్దాం భైదరద్వీపం సీక్వెలా, బొబ్బిలిసింహం సీక్వెలా అని ఓపెన్‌గానే అడిగేసింది. ఆ తర్వాత బాలయ్య , రోజా ఇద్దరు రాజకీయాల్లో బిజీ అయ్యి ఎమ్మెల్యేలు అయ్యారు.