సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక నెటిజన్స్ నోటి దూల ఎక్కువైపోతుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ స్టార్ యాంకర్ నలుగురిలో అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడుగుతూ వాళ్ళ పరువు తీసేస్తున్నారు. ఇలా చాలామంది హీరోయిన్స్ కి క్యారెక్టర్ ఆర్టిస్టులకి హీరోలకి అందరికీ జరిగింది. రీసెంట్ గా జబర్ధస్త్ యాంకర్ రష్మీ కి ఇలాంటి అనుభవమే ఎదురయింది.
జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పాపులర్ అయిన రష్మీ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్స్ ని అభిమానులతో పంచుకుంటూ.. చిట్ చాట్ చేస్తూ సరదాగా ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన రష్మికి నెటిజన్స్ నుంచి భయంకరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి తిప్పికొడుతూ రష్మి ఇచ్చిన ఆన్సర్స్ సూపర్ అంటున్నారు ఆమె ఫ్యాన్స్.
ఈ క్రమంలోనే ఓ నెటిజన్..” ఎందుకు రష్మీ నువ్వు ఆ పనికిమాలిన చెత్త షోస్ చేస్తున్నవ్.. హీరోయిన్గా ట్రై చేయొచ్చుగా” అంటూ కామెంట్ పెట్టాడు . దీనికి జబర్దస్త్ యాంకర్ రష్మీ రిప్లై ఇస్తూ..” నా దగ్గర మంచి మంచి స్టోరీలు ఉన్నాయి. నేను హీరోయిన్గా నటిస్తాను ..నువ్వు సినిమా నిర్మిస్తావా.. చెప్పు ఇప్పుడు యాంకరింగ్ మానేసి వస్తాను” అంటూ పగిలిపోయే ఆన్సర్ ఇచ్చింది . దీంతో ఆ నెటీజన్ ఏమి చెప్పలేక సైలెంట్ అయిపోయాడు .ప్రస్తుతం రష్మీ ఆన్సర్ ను వైరల్ చేస్తున్నారు ఆమె [ఫ్యాన్స్. ఇలానే ఉండాలి ఇలాంటి తప్పుడు ప్రశ్నలు అడిగే వాళ్లకి పగిలిపోయే ఆన్సర్ ఇస్తేనే కరెక్ట్ అంటూ రష్మిని పొగిడేస్తున్నారు.