నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండతో అరాచకం చూపించేశాడు. అఖండ మామూలు హిట్ అవ్వలేదు. బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అఖండ. అఖండతో బాలయ్య మామూలు రైజింగ్‌లోకి రాలేదు. గత డిసెంబర్ 2న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అఖండ తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తోన్న బాలయ్య మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన కొత్త సినిమా చేస్తున్నాడు.
NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతీహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపిస్తుండగా… మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో నటి హనీ రోస్ మరో హీరోయిన్గా నటిస్తోందట.
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే డిసెంబర్లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఫారిన్ షెడ్యూల్లో సైతం ఓ రొమాంటిక్ సాంగ్‌తో పాటు కొన్ని యాక్షన్ సీన్లు షూట్ చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ క్లోజ్ చేశారట మేకర్స్.
రు. 58 కోట్లకు ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ క్లోజ్ అయ్యాయట. ఇది బాలయ్య కెరీర్లోనే హయ్యస్ట్ రికార్డ్. అఖండతో వచ్చిన క్రేజ్‌తో బాలయ్య సినిమాకు ఈ రేంజ్లో బిజినెస్ డీల్స్ అయితే నడుస్తున్నాయని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెడుతున్నారు. మలినేని గోపీ క్రాక్ తర్వాత డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.