మనం మాట్లాడే ప్రతి మాట ఆలోచించుకొని మాట్లాడాలి ..ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని ..ఆచి తూచి మాట్లాడితేనే జీవితంలో ముందుకు సాగగలం అంటూ మన పెద్దలు మనకి చెబుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ..సెలబ్రిటీ హోదా కలిగిన మనుషులు ప్రతి విషయాన్ని ఆలోచించి మాట్లాడాలి. పుసుక్కున నోరు జారారా సోషల్ మీడియా లో ట్రోలింగ్ కి గురవ్వాల్సిందే. ప్రజెంట్ ఇదే పోజీషన్ ని ఫేస్ చేస్తున్నాడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.
జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డిఫరెంట్ స్టైల్ కొరియోగ్రఫీతో టాలీవుడ్, బాటాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. అంతేకాదు గతంలో బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరించాడు. జీ తెలుగులో ప్రసారమైన ఓ షోలో జానీ మాస్టర్ అనసూయతో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు . ఏకంగా తన చీర కొంగును నోట్లో పెట్టుకొని మరి స్టెప్స్ వేసి కుర్రాళ్లకు ఊపు తెప్పించాడు. అంతలా స్పాంటేనియస్ గా కొరియోగ్రఫీ చేయడంలో జానీ మాస్టర్ ధిట్ట. ఈ మధ్యనే రిలీజ్ అయిన బీస్ట్ సినిమాలోని హైలెట్ గా మారిన “అరబిక్ కుతూ” సాంగ్.. ఆ తర్వాత “రక్కమ్మ” సాంగ్ కంపోజ్ చేసింది జానీ మాస్టర్ నే.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే గతంలో జానీ మాస్టర్ ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షో కి జడ్జిగా వ్యవహరించారు. కాగా ఢీ షో గురించి ఎప్పుడు సోషల్ మీడియాలో ఓ నెగటివ్ ప్రచారం జరుగుతూనే ఉంటుంది . షోలో డాన్స్ తప్ప అన్నీ ఉంటాయని.. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్ డాన్స్ చేయడం మానేసి సర్కస్ చేస్తుంటారు,, రొమాన్స్ చేస్తుంటారు,, అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి క్రమంలోనే అలాంటి కామెంట్లపై జానీ మాస్టర్ స్పందిస్తూ,,” అందరూ రాసుకోండి.. ఇంకోసారి ఢీ షో గురించి ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే.. అస్సలకి ఊరుకోను” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో జానీ మాస్టర్ ని ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు. “ఢీ షో కి నీకు ఏంటి లింక్ ..ఆ షోని అంటే నీకేంటి నొప్పి..” అంటూ బూతులు తిడుతున్నారు. మరి చూడాలి జానీ మాస్టర్ కామెంట్స్ పై స్పందిస్తారో లేదో..?