జనరల్ గా మన ఇంట్లోని పెద్దవాళ్ళు చెబుతుంటారు… ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలని ..తొందరపడి ఒక మాట మాట్లాడితే ..ఆ తర్వాత ఆ మాటకు తగ్గ పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ..ప్రజెంట్ ఇలాంటి పోసిషన్లోనే ఉంది హీరోయిన్ రెజీనా. ఎస్ రీసెంట్ గా ఆమె చేసిన అబ్బాయిలు మ్యాగీ కామెంట్స్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో వైరల్ గా మారాయో మనకి తెలిసిందే.
మొదట టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బాలీవుడ్ లో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ క్రేజీ క్రేజీ ప్రాజెక్ట్ ను పట్టేస్తున్న హాట్ బ్యూటీ.. రీసెంట్ గా ఈమె నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా శాకినీ డాకిని. నివేదా థామస్ , రెజీనా ఇద్దరు కూడా ఈ సినిమాలో లేడీ ఓరియంటెడ్ గా నటించి జనాలను మెప్పించడానికి రెడీగా ఉన్నారు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రెజీనా అబ్బాయిల గురించి కొన్ని కామెంట్స్ చేసింది. ” మ్యాగీ అబ్బాయిలు టూ మినిట్స్ లో అయిపోతారు ” అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.
దీంతో రెజీనా చేసిన కామెంట్స్ సినీ ఇండస్ట్రీ ని ఓ ఊపు ఊపేసింది. అంతేకాదు కొందరు అబ్బాయిలు రెజీనాను టార్గెట్ చేశారు. నీ కంటికి మగాళ్ళు అంత చులకనగా కనిపిస్తున్నారా..? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కాగా రెజీనా మాటలపై యంగ్ హీరో అడవి శేషు స్పందించాడు. “శాకిని డాకిని” ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ ..”నేను చాలా కాలంగా సినీ ఇండస్ట్రీలో సినిమాలు తీస్తున్నాను.. స్టామినా ఎక్కువ అవుతుందని అనుకుంటున్నాను.. నువ్వేంటి మగాళ్లను మ్యాగీ అంటున్నావ్” అంటూ సరదాగా కామెంట్ చేశారు. దీనికి రెజీనా కూడా తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చింది.” టూ మినిట్స్ లో చెప్తా” అంటూ అడవి శేషు కి పరోక్షంగా మళ్లీ మ్యాగీ అంటూ కామెంట్ చేసింది. దీంతో అడవి శేషు రెజీనా కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. మరి చూడాలి ఈ సినిమా ద్వారా ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటాదో రెజినా.. తద్వారా తెలుగులో ఎలాంటి సినిమాలు అందుకుంటుందో..?