బిగ్ బాస్ ఈ షో ని తిట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో.. చూసేవాళ్ళు అంతకు డబుల్ల్ మంది ఉన్నారు. తిడుతూ చూసే వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి ఓ క్రేజీ పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది బిగ్ బాస్. ఇప్పటికే తెలుగులో సక్సెస్ ఫుల్ గా ఐదు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్. కొద్ది రోజుల క్రితమే ఆరో సీజన్ ని కూడా మొదలుపెట్టింది. కాగా మొదటి నుంచి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరా అంటూ ఆరా తీసిన జనాలకు నిరాశ మిగిలైంది. ఎందుకంటే ఈ సీజన్ లో చెప్పుకోతగా కంటెస్టెంట్లు ఎవ్వరూ లేరు. మనకు తెలిసిన ముఖాలు ముగ్గురు నలుగురు ఉన్నారు అంతే .
కాగా మనకు తెలిసిన ముఖాలలో చెప్పుకోతగిన ముఖం చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన సుదీప. బహుశా సుదీప అంటే అందరికీ తెలియకపోవచ్చు ..పింకీ అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు . అంతలా ఆమె ఒరిజినల్ పేరు కన్నా సినిమా పేరుతోనే పాపులర్ అయింది. ఈ బ్యూటీ నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లిగా నటించిన ఈ సుదీప.. పింకీ అనే క్యారెక్టర్ లో లీనం అయిపోయింది. ఇప్పటికీ జనాలు ఆమెను పింకీ గానే గుర్తిస్తున్నారు అంటే ఆమె ఆ పాత్రలో ఎంత ఒదిగిపోయి నటించిందో మనం అర్థం చేసుకోవచ్చు.
బిగ్ బాస్ లోకి సెకండ్ కంటెస్టెంట్ గా ఎంటర్ అయిన సుదీప.. స్టేజిపై తన ఫ్యామిలీ సీక్రెట్స్ ను హోస్ట్ నాగార్జునతో పంచుకున్నింది. అంతేకాదు తాను నాలుగు సంవత్సరాలు నరకం చూసాను అంటూ ఎమోషనల్ అయింది. దానికి కారణం వాళ్ళ పేరెంట్స్ అంటూ మరో షాకింగ్ విషయం బయటపెట్టింది. సుదీప చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకుంది. శ్రీ రంగనాథ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రేమించి వివాహం చేసుకున్న సుదీప వాళ్ళ ఇంట్లో ఆ ప్రేమను ఒప్పించుకోవడానికి నాలుగేళ్లకు పైగా అని పట్టింది అంటూ చెప్పుకొచ్చింది
ప్రేమించి పెళ్లి చేసుకున్న సుదీప ఆ పెళ్లిని జరిపించుకోవడానికి ఇంట్లో ఏకంగా నాలుగు సంవత్సరాలు ఒప్పించిందట. నిజానికి శ్రీ రంగనాథుని పెళ్లి చేసుకోవడం వాళ్లకి ఇష్టం లేదట. దీంతో ఆమెను వేరే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారట. అలా ఇలా కాదు నాలుగేళ్లు నాకు ఇష్టం లేదు అంటున్నా కానీ ఏదో ఒక సంబంధం తెచ్చి ఇబ్బంది పెట్టే వాళ్ళట. అలా కొన్నిసార్లు నేను మూడు నాలుగు రోజులు అన్నం తినకుండా కూడా ఉన్నానని ..దీంతో నాలుగేళ్లు నేను భరించలేని నరకం అనుభవించాను అంటూ చెప్పుకొచ్చిందట. దీంతో తెరపై ఎప్పుడు హ్యాపీగా కనిపించే పింకీ జీవితంలో ఇన్ని బాధలు ఉన్నాయా అంటూ అభిమానులు ఫీల్ అయిపోతున్నారు. అంతేకాదు పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సుదీప సీరియల్స్ చేస్తూ తనదైన స్టైల్ లో నటిస్తుంది. మరి చూడాలి బిగ్ బాస్ ద్వారా సుదీపకు ఎలాంటి పేరు వస్తుందో..?