“ఏందిరా అయ్యా.. ఏం చేస్తున్నావ్.. దున్నపోతుకు పాలు పితుకుతున్నావా.. దున్నపోతా”.. ఈ డైలాగ్ వినగానే మన అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు జయప్రకాష్ రెడ్డి. సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో కామెడీ చేస్తూ జనాలను కడుపుబ్బ నవ్వించే ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . దాదాపు 160 సినిమాలకు పైగా తనదైన స్టైల్ లో కామెడీ చేసి నవ్వించిన ఘనత సాధించాడు. మరీ ముఖ్యంగా కబడి కబడి చిత్రంలో ఈయన నటించిన పర్ఫామెన్స్ జనాలకు విపరీతంగా ఆకట్టుకుంది . అంతేకాదు కేవలం కామెడీగానే కాదు సమరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణకు ధీటైన విలన్ గా నటించి తనదైన స్టైల్ లో మెప్పించాడు.
అలా విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ..హీరోయిన్ తండ్రిగా హీరోని చితకొట్టే విధంగా ఏ పాత్రలోనైనా సరే జయప్రకాష్ సూపర్ సక్సెస్ అయ్యాడు. కాగా మంచి పొడవు దానికి తగ్గ వైట్ దానికి తగ్గ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే అంతే ఎలాంటి హీరో అయినా సరే గజగజ వణికిపోయే విధంగా ఉంటుంది. వరస సినిమాలతో మంచి పొజిషన్లో ఉన్న ఈయన అనుకోకుండా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు . దానికి కారణం ఆయన హెల్త్ కండిషన్
ఆయన ఆరోగ్యం బాగోలేని కారణంగా సినిమా ఇండస్ట్రీకు దూరంగా ఉండిపోయాడు. కానీ అనుకోని విధంగా ఆయన గుండెపోటుతో మరణించాడు. జయప్రకాష్ మరణం అప్పట్లో సినీ ఇండస్ట్రీని షాకింగ్ కి గురి చేసింది. బాత్రూం కని వెళ్లి అక్కడే ఎవరికి ఊహించని విధంగా దీనస్థితిలో పడిపోయి చనిపోయి ఉన్నారు. దీని డాక్టర్లు గుండె పోటు అని నిర్ధారించారు. అయితే జయప్రకాశ్ రెడ్డి మరణం ఇప్పటికీ ఇండస్ట్రీలో ఓ మిస్టరీగానే మిగిలిపోయింది .
కాగా అప్పట్లో ఈయన మరణం గురించి రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. కొందరు బంధువులు ఆయనను కావాలనే తన ఆస్తి కోసం సినీ ఇండస్ట్రీకి దూరంగా నెట్టేసి ..చిత్రహింసలు గురి చేశారన్న వార్తలు వైరల్ గా మారాయి. అయితే దీనిపై జయప్రకాష్ ఎప్పుడు స్పందించలేదు. కానీ ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ..ఆయన నటించిన సినిమాల ద్వారా కామెడీ ద్వారా జనాల మనసుల్లో జయప్రకాష్ ఎప్పుడు బ్రతికే ఉంటాడు.