తెలుగు సినిమా ఓ మాయా ప్రపంచం. ఎప్పుడు ఎవరు హైట్స్‌కి వెళతారో? ఎప్పుడు ఎవరు పడిపోతారో అస్సలు చెప్పలేం. నిన్నటివరకూ టాప్‌లో ఉన్న శ్రీనువైట్ల, కోనవెంకట్‌లు ఇప్పుడు ఏ పొజిషన్‌లో ఉన్నారు. ముందు సినిమాకు పది కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న డైరెక్టర్ కూడా తేడా కొడితే తర్వాత సినిమాకు కోటి రూపాయలకు …అట్టే మాట్లాడితే ఫ్రీగా కూడా సినిమా చేయాల్సి రావచ్చు. బయటి వాళ్ళకు ఇలాంటి విషయాలు కాస్త విచిత్రంగా అనిపిస్తాయి కానీ ఇండస్ట్రీ పీపుల్‌కి మాత్రం వెరీ కామన్.
కానీ సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, నరసింహనాయుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ బి.గోపాల్ ఓ అద్భుతాన్నే చేసి చూపించాడు. ఒకసారి పడడం అంటూ మొదలయ్యాక మళ్ళీ నిలబడ్డవాళ్ళు చాలా తక్కువ మంది. అలాగే ఓ సినిమా ఆగిపోయాక మళ్ళీ ట్రాక్‌లోకి తీసుకురావడం కూడా మామూలు విషయంకాదు. ఇఫ్పుడు బి. గోపాల్ అలాంటి అద్భుతం చేశాడు. ఎప్పుడో ఆగిపోయిన సినిమాను మళ్ళీ వార్తల్లోకి తీసుకొచ్చాడు. డిసెంబర్‌లో రిలీజ్ కూడా చేస్తానంటున్నాడు. గోపీచంద్, నయనతారలు హీరో, హీరోయిన్స్‌గా యాక్ట్ చేస్తుండడంతో సినిమాకు కూడా మంచి క్రేజే వచ్చే ఛాన్స్ ఉంది. కానీ సినిమా టైటిల్ మాత్రం తన ఓల్డ్ టేస్ట్‌కు తగ్గట్టుగా ‘బలం’ అని పెట్టాడు. రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఈ జనరేషన్ ఆడియన్స్‌ని కూడా మెప్పించాడంటే మాత్రం చరిత్ర తిరగరాసినంత పేరు రావడం ఖాయం. సాధ్యమేనంటారా?