సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్ లు కావాలని వివాదాల్లో చిక్కుకుంటారో లేదంటే వివాదాలే వారిని చుట్టుముడతాయో తెలియదు కానీ ఎప్పుడూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతారు. అలాంటి హీరోయిన్స్ లో హాట్ బ్యూటీ రాధిక అప్టే ముందు వరుసలో ఉంటుంది. రాధికా అప్టే బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసింది. అంతే కాకుండా తెలుగులో బాలయ్య హీరోగా నటించిన లెజెండ్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో అందం అభినయం తో రాధికా ఆకట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
అయితే ఈ సినిమా తరవాత మాత్రం టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు అందుకోలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం రాధిక వెబ్ సిరీస్ లు సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. లెజెండ్‌కు ముందు ఆమె తెలుగులో రక్తచరిత్ర సినిమా చేసింది. లెజెండ్ తర్వాత మరోసారి బాలయ్యతోనే లయన్ సినిమా చేసింది. ఈ సినిమా ప్లాప్ కావడంతో తర్వాత రాధికను ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియా లో కూడా రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తుంటుంది. దాంతో సోషల్ మీడియా కూడా రాధిక కు ఫ్య్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది.
ఇదిలా ఉంటే పార్చ్డ్ అనే సినిమా లో రాధిక రొమాంటిక్ సీన్ లో నటించింది. కాగా ఆ సీన్ లీక్ అయ్యి నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఆ సీన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను అని రాధిక ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. ఆ సినిమాను ఆ సీన్ ను ఎప్పటికీ మర్చిపోలేను అని ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాలో రొమాంటిక్ సీన్ లో నటించేటప్పుడు సహ నటుడు ఆదిల్ హుస్సేన్ చాలా జోక్స్ వేశాడు అని చెప్పింది. ఒకవేళ అతి చేసినట్టు అనిపించినా హద్దు మీరినట్టు అనిపించినా సారీ అని అన్నాడని పేర్కొంది.
ఇక ఈ సినిమాలోని రొమాంటిక్ సీన్లు ముందే లీక్ అవ్వడంతో సినిమా కు క్రేజ్ తగ్గిపోయింది. అంతే కాకుండా ఈ వీడియోలను సీడీ ల రూపంలో కూడా మార్చి అమ్మడంతో సినిమా కు భారీగా నష్టం జరిగింది. ఇక రాధిక బ్రిటీషర్ అయిన బెనడిక్ట్ టేలర్‌ను పదేళ్ల క్రితమే వివాహం చేసుకుంది. అయితే వీరిద్దరు కెరీర్ పరంగా వేర్వేరు చోట్ల ఉంటూ వస్తున్నారు. ఇక రాధిక కూడా కాస్టింగ్ కౌచ్ విషయంలో ఎప్పుడూ కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ ఉంటుంది.