వినాయక చవితి అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు… అటు నార్త్ ఇండియన్స్ కూడా ఎంత గొప్పగా జరుపుకుంటారో చెప్పక్కర్లేదు. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో వినాయక మండపాలు, ఆ పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం మామూలే. ఇక ఖైరాతాబాద్ వినాయకుడి గురించి దశాబ్దాలుగా చరిత్ర చరిత్రలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక వినాయక చవితి విషయంలో చాలా మందిస సెలబ్రిటీలకు కూడా ఎన్నో మరపురాని మధురానుభూతులు ఉంటాయి.
ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం తన చిన్నప్పటి వినాయక చవితి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. గణేష్ మండపాలు చూసేందుకు భాగ్యనగరం నడివీథుల్లో బైక్‌పై గల్లి గల్లీ తిరిగిన రోజులు గుర్తు చేసుకున్నాడు. అమ్మ చేతుల మీదగానే ఇంట్లో గణేషుడి పూజ జరిగేదని… పూజ పూర్తయిన వెంటనే వీథుల్లో గణేష్ మండపాలు చూసేందుకు బైక్‌పై వీథి వీథి తిరగేవాడిని అని చెప్పారు.
ఖైరతాబాద్ పెద్ద వినాయకుడితో పాటు వీథుల్లో ఉండే చిన్న చిన్న వినాయక విగ్రహాలను కూడా తాను చూసేవాడిని అని చెప్పాడు తారక్. చవితి రోజు సాయంత్రం అయితే మండపాల దగ్గర జరిగే చవితి వేడుకలను, డ్యాన్సులు చూసేందుకు కూడా వెళ్లి తాను ఎంజాయ్ చేసేవాడిని అని తారక్ చెప్పాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్టు కూడా చెప్పాడు. తాను చిన్నప్పుడు కేవలం ప్రసాదాల కోసమే వినాయక మండపాల దగ్గరకు వెళ్లే వాడిని అని.. ఆ తర్వాత కాస్త పెద్దయ్యాక మండపాలు, వినాయక విగ్రహాలు చూసేందుకు వెళ్లేవాడిని అని చెప్పాడు.
అయితే ప్రస్తుతం తాను ఇంట్లోనే కుటుంబంతో కలిసి వినాయక పూజ జరుపుకుంటానని చెప్పాడు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే త్రిబుల్ ఆర్ సినిమాతో సూపర్ పాన్ ఇండియా హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా విజయంతో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు తన 30, 31 సినిమాలను వరుసగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ రెండు కూడా భారీ పాన్ ఇండియా సినిమాలుగా వస్తున్నాయి.