సినిమా రంగంలో ఉన్నవాళ్లు ఆకర్షణలకు, జల్సాలకు అలవాటు పడి ఫ్యామిలీని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ క్రమంలోనే అవి విడాకుల వరకు దారి తీస్తుంటారు. అలాగే ఇద్దరి మధ్య మాట పట్టింపులు, పంతాలు కూడా విడాకులకు కారణమవుతాయి. కానీ రెండు దశాబ్దాల క్రిందట టాలీవుడ్ లో హీరో, హీరోయిన్లుగా ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వారి ప్రేమ పెళ్లి తమ కెరీర్‌కు అడ్డు రాకూడదనే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని ఇప్పటకీ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఆ ఇద్దరు ఎవరో కాదు సీనియర్ హీరో సురేష్, ఒకప్పటి హీరోయిన్ అనితా రెడ్డి.
సీనియర్ ఎన్టీఆర్తోనే రాముని మించిన రాముడు లాంటి సినిమాలు స్వీయ దర్శకత్వంలో రూపొందించారు సీనియర్ దర్శక నిర్మాత చంద్రశేఖర్. ఆయన తనయుడే సురేష్. 1990లో ఆయన అప్పుడు హీరోయిన్గా ఐదారు సినిమాలు చేసిన అనితారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అనితారెడ్డి బాలకృష్ణతో కూడా బాబాయ్ అబ్బాయ్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు జంధ్యాల దర్శకుడు. అప్పట్లో ఇద్దరి కెరీర్ సినిమా పరంగా బాగుండడంతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.
అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. పెళ్లికి ముందు సురేష్‌కు సినిమా పరిశ్రమలో పెద్ద అవకాశాలు రాలేదు. అనిత అమెరికాలో సెటిల్ కావాలని అనుకుంది. అందుకు సురేష్ ఒప్పుకున్నారు. ఈ లోగా ఆమె పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుతోంది. కట్ చేస్తే పెళ్లయ్యాక రెండు, మూడేళ్లలో సురేష్ ఇక్కడ తెలుగు, తమిళంలో ఫుల్ బిజీ నటుడు అయిపోయాడు. అప్పుడు సురేష్ సినిమాలు వదులుకుని అమెరికా వెళ్లేందుకు ఇష్టపడలేదు.
అయితే అనిత అప్పటి వరకు సినిమాల్లో హీరోయిన్గా, పాపులర్ సింగర్‌గా చేసినా ఇండస్ట్రీలో ఉండేందుకు ఇష్టపడలేదు. అనిత అక్కడ ఉండేందుకు కాంప్రమైజ్ కాలేదు. సురేష్‌ను ఇండస్ట్రీకి వదిలి వెళ్లాలని లేదు. అయితే ఇద్దరికి ఓ బిడ్డ పుడితే వీరు సెటిల్ అవుతారని అనుకున్నారు. అప్పటికే వీరికి నిఖిల్ అనే కుమారుడు పుట్టాడు. చివరకు ఎవ్వరూ కాంప్రమైజ్ కాలేదు. ఇద్దరూ తమ తమ కెరీర్ కోసం స్నేహితులుగానే విడిపోవాలని అనుకున్నారు.
ఇక విడాకుల తర్వాత ఇద్దరూ వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడు సురేష్ భార్య, అనిత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. సురేష్ దంపతులు అమెరికా వెళితే వాళ్ల ఇంట్లోనే ఉంటారట. అలాగే అనితారెడ్డి, తన భర్తతో కలిసి ఇండియాకు వస్తే ఇక్కడ సురేష్ ఇంట్లోనే ఉంటారట. అలా తాము తమ కెరీర్ కోసం విడిపోయినా ఇప్పటకీ మంచి స్నేహితులుగానే ఉంటామని సురేష్ ఓ సందర్భంలో చెప్పారు.