టాలీవుడ్లో ఇటీవల వరుసగా తీవ్ర విషాదాలో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ టాలెంటెడ్ దర్శకుల్లో కేఎస్. రవీంద్ర ( బాబి) ఒకరు. రచయితగా కెరీర్ ప్రారంభించిన బాబి ఆ తర్వాత రవితేజ పవర్ సినిమాతో సత్తా చాటుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో జైలవకుశ లాంటి హిట్ సినిమా తీశాక… వెంకీ – నాగచైతన్యతో వెంకీమామతోనూ ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా బాబి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
బాబి తండ్రి కొల్లి మోహనరావు మృతిచెందారు. గత కొంత కాలంగా ఆయన కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు హైదరాబాద్‌లోన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే దురదృష్టవశాత్తు మోహనరావు తన 69వ ఏట ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్టు తెలిసింది.
దీంతో బాబి ఇంట్లో తీవ్ర విషాదమైంది. బాబి తండ్రి మృతి చెందడంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక బాబి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది.