Moviesభర్త అంటే ఇలా ఉండాలి..ఆ విషయంలో భార్య కోసం ఏం చేసాడో...

భర్త అంటే ఇలా ఉండాలి..ఆ విషయంలో భార్య కోసం ఏం చేసాడో తెలుసా..?

యస్ ఇప్పుడు అందరు అదే అంటున్నారు. ఇలాంటి భర్త మాకు ఉంటే రా బాబు అని ఆడవాళ్లు సరదాగా నవ్వుకుంటున్నారు. జనరల్ గా భర్త.. భార్య పుట్టిన రోజుకి, భార్య.. భర్త పుట్టిన రోజుకి సరదాగా గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఇచ్చుకుంటారు గిఫ్ట్ ఇస్తేనే భార్య మీద ప్రేమ ఉన్నటా అంటే.. కాదండోయ్ . గిఫ్ట్ ఇవ్వకపోయినా భార్య మీద ప్రేమ ఉన్నట్లే . కానీ కచ్చితంగా ఆడవారు తమ పుట్టినరోజు నాడు పెళ్లిరోజు నాడు భర్త నుంచి ఏదైనా స్పెషల్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు . కచ్చితంగా అది అందరూ ఆడవాళ్ళల్లోను ఉంటుంది.


కానీ, తమ కుటుంబ పరిస్థితిని బట్టి ఆడవాళ్లు అడ్జస్ట్ అవుతూ ఉంటారు. కాగా రీసెంట్ గా బుల్లితెర నటుడు తన భార్యకి ఇచ్చిన బర్త డే సర్ప్రైజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇంతకీ ఆ బుల్లితెర నటుడు భార్యకి ఏమి ఇచ్చాడో తెలుసా..? తన బంగారం లాంటి భార్య కోసం షాకింగ్ సర్ప్రైజ్ గా బంగారాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఏ నెక్లెసో.. ఏ రింజో కాదు.. ఆమెకి ఇష్టమైనవన్నీ కొనిచ్చాడు. దాదాపు 200 గ్రాముల బంగారాన్ని తన భార్య పుట్టిన రోజు కానుకగా తన ప్రియమైన భార్యకి ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది.

బుల్లితెర నటి విష్ణు ప్రియ సీరియల్స్ ద్వారా మనకు బాగా సుపరిచితురాలే. బుల్లితెర నటి విష్ణు ప్రియ ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . తన నటనతో తన స్పాంటేనియస్ యాక్టింగ్ తో చాలామంది అభిమానులను సంపాదించుకుంది. ఇప్పటికే బోలెడు సీరియల్స్ లో తన నటనతో మెప్పించిన విష్ణు ప్రియ.. ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తన పర్సనల్ లైఫ్.. సీరియల్ లైఫ్ గురించి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

రీసెంట్ గా ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో..” నా బర్త్ డే కి మా వారి బంగారు కానుక”.. అంటూ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సుమారు 200 గ్రాముల బంగారాన్ని ఆమె భర్త గిఫ్ట్ గా ఇచ్చారు. తన భర్త బంగారు షాపుకు తీసుకెళ్లి గాజులు, నెక్లెస్ , ఇయర్ రింగ్స్ అన్ని మ్యాచింగ్ కి తగ్గట్టు ఆమెకు నచ్చినవి కొన్ని ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . అంతేకాదు దీని కింద ఆడవారు కామెంట్స్ పెడుతూ “నా భర్త ఇలా కొనిస్తే బాగుంటుంది” నువ్వు సో లక్కీ విష్ణు ప్రియ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news