ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఒకటే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. అదే టాలీవుడ్ డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. తాజాగా ఈయన డైరెక్టర్ చేసిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్టు 25వ తేదీన రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ టాక్ ను సంపాదించుకుంది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా మొదటి షో తోనే దారుణమైన రిజల్ట్ అందుకుంది. హీరోగా విజయ్ దేవరకొండ తన పూర్తి స్టామినా పెట్టినప్పటికీ డైరెక్షన్ బాగాలేని కారణంగా సినిమా ఫ్లాప్ టాక్ సంపాదించుకుంది .
సినిమా కి ఫ్లాప్ టాక్ వచ్చిన చాలామంది ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టినటించాడు అంటూ పొగిడేస్తున్నారు. దీంతో అటు విజయ అభిమానులు ఇటు నెటిజెన్స్ పూరిని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. పూరిని ఓ రేంజ్ లో నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. “నీకు డైరెక్షన్ చేతకాకపోతే ఇంట్లో కూర్చో.. నువ్వు ఫేడ్ అవుట్ డైరెక్టర్.. అసలు మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమా పోకిరి తీసింది నువ్వేనా లేక ..వేరే ఎవరైనా తీసి నీ పేరు వేసుకున్నావా..” అంటూ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.
కాగా రీసెంట్ గా ఇలాంటి ఇలాంటి ట్రోల్లింగ్స్ పై పూరీ జగన్నాథ్ భార్య లావణ్య ఘాటు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. చాలామంది సోషల్ మీడియా వేదికగా పూరిని ట్రోల్ చేస్తున్నారు. కొందరు చార్మి పేరుని మధ్యలోకి తీసుకొచ్చి ఆమెతో నీ సంబంధం తెగిపోతూనే నువ్వు డైరెక్టర్ గా బాగుపడతావు అంటూ తన పర్సనల్ లైఫ్ ని సోషల్ మీడియాలో పెట్టేశారు . ఈ క్రమంలోని పూరి జగన్నాథ్ భార్య లావణ్య ఫ్రెండ్ ఫోన్ చేసి లైగర్ సినిమా ఫ్లాప్ గురుంచి రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేసిందట. .అయితే తనని పరోక్షంగా విమర్శించడానికి కాల్ చేసిన తన ఫ్రెండ్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చినట్లు లావణ్య తెలుస్తుంది.
” మా ఆయన గురించి నాకు తెలుసు. మా ఆయన సత్తా ..స్టామినా ..ఏంటో అందరికీ తెలుసు. ప్రజెంట్ టైం బాగా లేకపోవచ్చు. కానీ మళ్ళీ పూరి అంటే మన తెలుగు డైరెక్టర్ రా అని అందరు గర్వపడేలా సినిమా తీస్తాడు. ఆ విషయంలో నాకు గట్టి నమ్మకం ఉంది. ఒకప్పుడు మా ఆయన తీసిన సినిమాలను చూసి శభాష్ అన్న వల్లే ఇప్పుడు పూరి దేనికి పనికిరాడు అంటున్నారు. మళ్ళీ అదే నోరులు పూరి మా డైరెక్టర్ అని అనిపించుకునేలా చేస్తాడు” అంటూ ఘాటుగా ట్రోలర్స్ కి.. అదేవిధంగా తన కి కాల్ చేసిన స్నేహితురాలికి కౌంటర్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది.