పాపం నిన్న మొన్నటి వరకు పూరి జగన్నాథ్ లైగర్ మూవీ హిట్ అవుతుంది,, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది,, సినీ ఇండస్ట్రీలో మరో కొత్త అధ్యాయనం మొదలవుతుంది పూరికి అంటూ ఓ రేంజ్ లో హ్యాపీగా ఫీల్ అయ్యారు పూరి జగన్నాథ్ అభిమానులు. కానీ ఒక్క కానీ ఫస్ట్ షో బొమ్మ పడగానే మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. బ్లాక్ బస్టర్ హిట్ కాదు కదా కనీసం పాజిటివ్ టాక్ కూడా సొంతం చేసుకోలేకపోయింది. పూరి కెరీర్లో డిజాస్టర్ మూవీగా రికార్డు నెలకొల్పింది.
అసలు ఈ సినిమాను తీసింది పూరి నేనా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఆయన అభిమానులు. ఒక ప్లానింగ్ లేదు ..కధ లేదు..సరైనా పాయింట్ లేదు ..అసలు కథలో కంటెంట్ లేదు ..ఈ సినిమాకు పోయి జ్న్ని నెలలు ప్రమోషన్స్ చేసాడా పూరి అంటూ తిట్టిపోస్తున్నారు . ఒకప్పుడు పోకిరి సినిమా తీసిన పూరి జగన్నాధ్ నేనా ఇప్పుడు లైగర్ మూవీ తీసింది అంటూ తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.అయితే కొందరు మాత్రం తెగించి పూరీ జగన్నాథ్ గతంలో చేసిన తప్పులను బయటకు తవ్వుతున్నారు. ఆ పాపమే నీ పాలిట శాపంగా మారింది అంటూ పుండు మీద కారం చల్లినట్టు ఇంకా రెచ్చగొడుతున్నారు. వాటిల్లో బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
పూరి కొడుకు ఆకాష్ పూరి చోర్ బజార్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేం. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న బండ్ల గణేష్ ఒక్కసారిగా ఏదో పూనకం వచ్చినట్లు పూరి జగన్నాథ్ ను పరోక్షంగా విమర్శించాడు. ఆయన మాట్లాడుతూ..” జీవితంలో వ్యాంపులు వస్తుంటారు పోతుంటారు అన్న.. కానీ వదినమ్మ నీకు శాశ్వతం.. నీకోసం వదినమ్మ పడిన బాధలు ఎన్నో నాకు తెలుసు. నీ కొడుకు ఫంక్షన్ కి రాలేనంత బిజీ అయిపోయావా నువ్వు? ఆకాష్ అంటే సన్నాఫ్ పూరి జగన్నాథ్ అంతే..వేరే పేరు రాస్తే తంతారు. వదినమ్మ ను బాధ పెట్టకు.. బాగా చూసుకో.. పవిత్రను ఆకాష్ ను బాగా సెటిల్ చెయ్యి” అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
దీంతో ఇప్పుడు ఇదే కామెంట్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొందరు పూరి హేటర్స్. పూరి జగన్నాథ్ భార్యను గతంలో ఏడిపించుకున్నాడు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఆనాడు పడిన బాధలు ఈనాడు ఛార్మి పూరి పాలిట శాపంగా మారిందని ..లైగర్ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని మరింత అప్పుల్లో కూరుకుపోయేలా చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే.. మరికొందరు మాత్రం ..”అసలే సినిమా ఫ్లాప్ అయిన బాధలో ఉన్నాడు .. మీరు ఇంకా బాధ పెట్టకండి.. పూరి జగన్నాథ్ ఒకప్పుడు సినిమాలను గుర్తు చేసుకోండి” అంటూ కూల్ చేస్తున్నారు.