Moviesసైలెంట్ షాకిచ్చిన సమంత..ఇక పై ఒక్కోక్కడికి పగిలిపోవాలే..!?

సైలెంట్ షాకిచ్చిన సమంత..ఇక పై ఒక్కోక్కడికి పగిలిపోవాలే..!?

ఇన్నాళ్లు సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వచ్చిన సమంత అభిమానులకు ఊహించిన విధంగా భారీ షాక్ ఇచ్చింది. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత, అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని ,,కొన్ని కారణాల చేత మనస్పర్ధలు కారణంగా.. విడాకులు తీసుకుని వేరువేరుగా జీవిస్తున్నారు. విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. ప్రతి విషయానికి సోషల్ మీడియానే బేస్ చేసుకుని.. తనను విమర్శించే వాళ్ళకి అదిరిపోయే కౌంటర్లు వేసింది . అంతేకాదు తనకు తన పరసనల్ స్టైలిస్ట్ కు మధ్య ఏదో ఉందంటూ రూమర్స్ క్రియేట్ చేసిన వాళ్లకు పగిలిపోయే ఆన్సర్ ఇచ్చింది.

ఇలా తనను విమర్శించే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఘాటుగానే జవాబు ఇస్తూ వచ్చిన సమంత.. గత కొన్ని రోజులనుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. దానికి కారణం ఓ బాలీవుడ్ బాడా హీరో అంటూ ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. సమంతకు జాన్ జిగిడి దోస్తే అయిన హీరో “నీపై జనాల్లో నెగటివ్ ఇంపాక్ట్ ఎక్కువ అయిపోతుంది.. కనుక నువ్వు కొద్ది రోజుల సోషల్ మీడియాకి దూరంగా ఉంటే మంచిది” అని సలహా ఇచ్చినట్లు సమాచారం. దీని కారణంగానే సమంత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకుండా సైలెంట్ అయినట్లు తెలుస్తుంది .

కానీ రీసెంట్ గా సినీ వర్గాల నుండి అందుతున్నన సమాచారం ప్రకారం ,,సమంత అదిరిపోయే ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఎప్పటి నుంచో బాలీవుడ్ లో మంచి పవర్ఫుల్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్న సమంతకు మైండ్ బ్లోయింగ్ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న సమంత.. ఇప్పుడు అలాంటి వెబ్ సిరీస్ నే మరొకటి అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా మెయిన్ లీడ్ గా నటించిన “సిట్టాల్‌ ” అనే అమెరికా వెబ్ సిరీస్ ను ఇండియన్ భాషల్లో రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ మెయిన్ హీరోగా నటిస్తున్నారు . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ హీరో వరుణ్ ని హీరోయిన్ గా ఈ వెబ్ సిరీస్ లో సమంత ఎంపికైందట. అంతేకాదు ఇప్పటికే ఈ అగ్రిమెంట్ పై సంతకాలు చేసిన సమంత ఈ వెబ్ సిరీస్ లో భారీ యాక్షన్స్ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుందట. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇద్దరూ కలిసి అమెరికాకు చెందిన స్టంట్ మాస్టర్ తో శిక్షణ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది . దాదాపు మూడు నెలల శిక్షణ ఉంటుందని ఈ వెబ్ సిరీస్ లో మనం మరొక కొత్త సమంత ని చూడబోతున్నామంటూ సినీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది. అన్ని వెబ్ సిరీస్ లో లాగా కాకుండా ఈ సిరీస్ లో యాక్షన్స్ సన్నివేశాలలో సమంత ఒళ్ళు జలదరించే విధంగా యాక్షన్స్ స్టంట్స్ చేయబోతుందని అందుకే శిక్షణాకాలం అధికంగా ఉంటుందని సమాచారం. మరి చూడాలి సమంత తన యాక్షన్ సీన్స్ తో తన సినీ చాప్టర్ క్లోజ్ అనిన వాళ్లకు ఎలాంటి పగిలిపోయే ఆన్సర్ ఇస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news