సోషల్ మీడియా ఇప్పుడు వికృత రూపం దాలుస్తోంది. పాజిటివిటి కంటే నెగటివిటికే ఎక్కువుగా ఉపయోగపడుతోంది. ఒక హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే చాలు యాంటీ ఫ్యాన్స్ పనిగట్టుకుని మరీ ఆ సినిమాను ప్లాప్ చేసేందుకు సోషల్ మీడియాను వాడుకుని సర్వశక్తులు ఒడ్డుతున్నారు. సినిమాకు హిట్ టాక్ వస్తేనే ఈ రోజుల్లో సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడగలుగుతోంది. యావరేజ్ టాక్ వచ్చినా యాంటీ ఫ్యాన్స్ ప్లాప్ అంటే బెనిఫిట్ షోల నుంచే నెగటివిటి స్ప్రెడ్ చేస్తూ దెబ్బేస్తున్నారు.
ఇక బాలీవుడ్లో కొద్ది రోజుల క్రిందట రిలీజ్ అయిన అమీర్‌ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాలే ఈ నెగటివిటి ముందు ఆగలేకపోయాయి. అదే బింబిసారకు హిట్ టాక్ రావడంతో అందరు హీరోల అభిమానులు భుజానకెత్తుకుని మోశారు. అయితే ఇప్పుడు రేపు రిలీజ్ అవుతోన్న విజయ్ దేవరకొండ లైగర్‌ను టార్గెట్ చేస్తూ నెగటివిటి స్ప్రెడ్ చేసేందుకు కొందరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు.
ఇక ఈ బాయ్‌కాట్ ట్రెండ్ ఇప్పుడు లైగర్ సినిమాకు కూడా తాకింది. అటు నార్త్‌లో లైగర్‌ను టార్గెట్ చేస్తూ బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తుంటే.. టాలీవుడ్లో కొందరు హీరోల ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ నెగటివిటి స్ప్రెడ్ చేసేందుకు కాచుకుని ఉన్నారని.. వారి సోషల్ మీడియా పోస్టులే చెపుతున్నాయి. విజయ్‌కు చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోల రేంజ్ క్రేజ్ వచ్చేసింది. విజయ్ కంటే ఎప్పుడో ఇండస్ట్రీలోకి వచ్చి.. ఎంతో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలను కూడా విజయ్ పాన్ ఇండియా క్రేజ్‌తో దాటేశాడు.
దీంతో ఇప్పుడు విజయ్ లైగర్ హిట్ అయితే మనోడిని పాన్ ఇండియా లెవల్లో ఎవ్వరూ ఆపలేరన్న నిర్ణయానికి వచ్చేసిన వారు లైగర్‌ను టార్గెట్ చేయడం మొదలు పెట్టేశారు. చివరకు ఈ నెగటివిటిని తట్టుకునేందుకు సినిమా మేకర్స్ విజయ్ పీఆర్ టీంతో పాటు మరో టీంను ఏర్పాటు చేసుకుని పాజిటివిటిని స్ప్రెడ్ చేస్తోంది. ఏదేమైనా ఈ తరహా విధానాన్ని ఎవరైనా ఖండించాల్సిందే.
టాలీవుడ్ హీరోలు కూడా తమ అభిమానులు ఇలా చేయకూడదని కండీషన్లు పెట్టడం, విజ్ఞప్తులు చేయడం చేయకపోతే అది ఇండస్ట్రీకే దెబ్బ. ఇక ఇటీవలే త్రిబుల్ ఆర్ సినిమా విషయంల రామ్‌చరణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఇదే తరహా వార్ నడిచింది. అలాగే మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య కూడా ఇదే తరహా అగ్లీ ఫైట్ కంటిన్యూ అవుతోంది. మరి ఈ నెగటివిటిని లైగర్ ఎలా తట్టుకుంటుందో ? చూడాలి.