టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ లైగర్. అసలు ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ అయిన రోజు నుంచే క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ ప్రాజెక్టులోకి ఎప్పుడు అయితే బాలీవుడ్ క్రేజీ కరణ్ జోహార్ యాడ్ అయ్యాడో అప్పటి నుంచి బీ టౌన్లో కూడా సూపర్ క్రేజ్ వచ్చేసింది. రేపు ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా లెవల్లో నార్త్ టు సౌత్ అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతోన్న ఈ సినిమాపై మామూలు అంచనాలు లేవు.
ఈ సినిమాకు నార్త్‌లో మంచి బజ్ రావడానికి కారణం.. విజయ్ దేవరకొండతో పాటు కరణ్ జోహార్ ఉండడం, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్గా చేస్తుండడమే..! ఇక ఈ సినిమాకు ఇండియాతో పాటు ఇతర దేశాల్లోనూ భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్‌లు నడుస్తున్నాయి. సినిమా ఓపెనింగ్స్ మాత్రం దుమ్ము రేగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఏపీ, తెలంగాణ మాత్రమే కాదు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర కూడా లైగర్ సెన్సేషన్ నమోదు చేస్తున్నట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.
యూఎస్‌లో ఇప్పుడున్న దూకుడు చూస్తుంటే కేవలం ప్రీమియర్లతోనే హాఫ్ మిలియన్ మార్క్ డాలర్లు సులువుగానే క్రాస్ చేసేయనుంది. ఇక నైజాంలో అయితే లైగర్ అడ్వాన్స్ బుకింగ్‌లు చూస్తుంటే ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యేలా ఉంది. ఇక హైదరాబాద్‌లో అన్ని మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో భారీ ఎత్తున షోలు వేస్తున్నారు. అన్ని షోలకు ఫస్ట్ డే దాదాపు హౌస్ ఫుల్స్ ఇప్పటికే బుక్ అయిపోయాయి.
హైదరాబాద్ నగరంలో లైగర్ ఫస్ట్ డే టిక్కెట్లు దొరకడం అయితే కష్టమైపోయింది. నైజాంలో ఫస్ట్ డే చాలా సులువుగా రు. 6 – 8 కోట్ల రేంజ్లో నెట్ వసూళ్లు వస్తాయని అంచనాలు వేస్తున్నారు. ఇక సీడెడ్, ఆంధ్రాలోనూ లైగర్ భారీ ఎత్తున థియేటర్లలో విడుదలవుతోంది. ఏదేమైనా ఫస్ట్ డే అదిరిపోయే వసూళ్లు ఖాయం అని లెక్కలు వేస్తున్నారు.