ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమ్రోగిపోతుంది అదే లైగర్. టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన మూవీ లైగర్. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా అందాలు వలకబోస్తూ ఓ రేంజ్ లో ఇచ్చిన పర్ఫామెన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుంది అంటూ ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా తెలిసిపోతుంది. ఈ సినిమాలో విజయ్ నటన మరో లెవెల్ కి తీసుకెళ్తుంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.
ఇప్పటికే లైగర్ర్ మూవీకి సంబంధించిన ఫస్ట్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తం 7 సీనులకు సెన్సార్ కట్ చెప్పినా సినిమాలో ఇంకా హాట్ పెర్ఫార్మెన్స్లు చాలానే ఉన్నాయి అని.. ముఖ్యంగా సినిమాకి విజయ్ ప్రాణం పోసాడని… కచ్చితంగా ఈ సినిమాతో పూరి జగన్నాథ్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ అందుకుంటాడని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకి విజయ్, పూరి తర్వాత మరో ప్లస్ పాయింట్ అనన్య పాండే అందాలు. పూరి చెప్పినట్లు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎక్కడా కష్టపడకుండా తనకున్న అందాలను అభిమానులకు చూపించిందంటున్నారు సెన్సార్ సభ్యులు.
కాగా మరికొద్ది గంటల్లోనే లైగర్ సినిమా రిలీజ్ కానుంది. అయినా కానీ సినిమా ప్రమోషన్స్ ఏమాత్రం వెనకడుగు చేయకుండా ఫాస్ట్ గా ముందుకు తీసుకెళ్తున్నారు టీం. రీసెంట్ గా ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండకు షాకింగ్ ప్రశ్న ఎదురైంది. రిపోర్టర్ మాట్లాడుతూ “మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తున్నారు. కానీ, ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే. ఏంటి పరిస్ధితి. మీరేం చేస్తారు” అంటూ డైరెక్ట్ గా విజయ్ ని ఫేస్ మీద అడిగేసాడు. దీంతో విజయ్ దేవరకొండ అతడికి స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చాడు. నిజానికి విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ కి ఈ ప్రశ్న అడిగిన రిపోర్టర్ని కచ్చితంగా కోప్పడేవాడు. కానీ ఈసారి అలా చేయలేదు.
ఆయన మారిపోయాడు ఆయన మాట్లాడుతూ..” అఫ్ కోర్స్ మీరు ఈ ప్రశ్న నన్ను ముందుగానే అడుగి ఉంటే కచ్చితంగా కోపంతో ఊగిపోయేవాడిని. కానీ ఇప్పుడు అలా చేయను ఎందుకంటే ఇప్పుడు నేను మారిపోయాను .సినిమా ప్రమోషన్స్ కోసం జనాలను మీట్ అయి వాళ్ళ ప్రేమను వాళ్ళ మనసును తెలుసుకున్నాను. ఇలా ప్రతి విషయానికి కోప్పడిపోయి. నన్ను నేను తక్కువ చేసుకోను. నా అభిమానులను తక్కువ చేయను. అభిమానులు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేసింది. వారిని నేను అగౌరవపరచలేను” అంటూ చాలా కూల్ గా రెస్పాండ్ అయ్యాడు. దీంతో “ఇది విజయ్ నేనా.. విజయ్ ఇంత కూల్ గా ఉన్నాడా.. విజయ్ ఇంత కూల్ గా మారిపోవడానికి కారణం పూరీ జగన్నాధ్” అంటూ నెట్టింట కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.