టాలీవుడ్ స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా కనీవినీ ఎరుగని రేంజ్‌లో విజయం సాధించింది. అసలు పుష్ప ఈ రేంజ్‌లో హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. చివరకు నార్త్‌లో కూడా పుష్ప ప్రమోషన్లు లేకుండానే రు. 100 కోట్లు కొల్లగొట్టడంతో ఇండియన్ సినిమా వర్గాలు సైతం షాక్ అయిపోయాయి. ఓవరాల్‌గా ఈ సినిమా రు. 400 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. దీంతో పుష్ప 2 సినిమాపై సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
పుష్ప రిలీజ్ అయ్యి ఇప్పటికే 9 నెలలు అవుతోంది. ఇంకా పుష్ప 2 పట్టాలు ఎక్కలేదన్న డిజప్పాయింట్‌లో ఉన్న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెపుతూ రెండు రోజుల క్రితమే ఈ సినిమా సీక్వెల్ స్టార్ట్ చేశారు. ఇక ఈ పుష్ప రు. 400 కోట్లు కొల్లగొట్టడంతో ఇప్పుడు సీక్వెల్ కోసం దర్శకుడు సుకుమార్ భారీ బడ్జెట్ కేటాయిస్తున్నాడు. పుష్ప 1తో పోలిస్తే 2 బడ్జెట్ డబులు కాబోతోందట.
ఇక సీక్వెల్‌కు కేటాయించే బడ్జెట్‌తో పాటు రెమ్యునరేషన్లు చూస్తే కళ్లు జిగేల్ మనేలా ఉన్నాయి. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఏకంగా రు. 100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకోనున్నాడట. అసలు ఇది మామూలు రెమ్యునరేషన్ కాదు. బన్నీ రేంజ్ ఎంతలా పెరిగిపోయిందో ఇదే నిదర్శనం. ఇక ఈ సినిమా కోసం దర్శకుడు సుకుమార్‌కు రు. 60 కోట్ల రెమ్యునరేషన్ అందుతోందట.
టాలీవుడ్‌లో రు. 50 కోట్లకు మించి రెమ్యునరేషన్ తీసుకుంటోన్న దర్శకుల జాబితాలో సుకుమార్ కూడా చేరిపోయాడు. ఇక రష్మికకు పుష్పలో రు. 2 కోట్లు ఇస్తే ఇప్పుడు ఏకంగా డబుల్ చేసి రు. 4 కోట్లు ఇస్తున్నారట. దేవిశ్రీ ప్రసాద్‌కు కూడా గట్టిగానే ముడుతున్నాయట. ఇక ఈ సినిమా ఖచ్చితంగా రు. 1000 కోట్ల వసూళ్లు సాధిస్తుందన్న అంచనాలతో ఏకంగా రు. 300 – 350 కోట్ల బడ్జెట్ పెట్టేందుకు రెడీ అవుతున్నారట.