సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఎవరికి ఎవరితో.. అవసరాలు ఉంటాయో చెప్పలేం. ఒక హీరోతో ఒక డైరెక్టర్ చేయాల్సిన సినిమాలోకి సడన్‌గా మరో హీరో వచ్చేస్తాడు. ఒక హీరో పక్కన నటించాల్సిన హీరోయిన్ సడన్‌గా మారిపోతూ ఉంటుంది. ఇలా ముందుగా అనుకున్న కాంబినేషన్లు మిస్ అయినప్పుడు కొందరి మధ్య గ్యాప్ తలెత్తుతూ ఉంటుంది. సీనియర్ నటుడు శ్రీకాంత్ హీరోగా టాలీవుడ్లో రెండున్నర దశాబ్దాల క్రిందట ఒక వెలుగు వెలిగిపోయాడు.
ముందు కెరీర్ ఆరంభంలో విలన్ గా వేషాలు వేసుకున్న శ్రీకాంత్… ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి ఐదేరేళ్లపాటు ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయారు. శ్రీకాంత్ విలన్ వేషాలు వేస్తున్నప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాక లైఫ్ ఇచ్చిన దర్శకులలో కోడి రామకృష్ణ – ఈవీవి సత్యనారాయణ – కే రాఘవేంద్రరావు ఉన్నారని శ్రీకాంత్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ తర్వాత శ్రీకాంత్ తన తోటి హీరోయిన్ ఊహను ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఈ దంపతుల కుమారుడు రోషన్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. అయితే సీనియర్ నిర్మాత,దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ శ్రీకాంత్‌ను తన దర్శకత్వంలో తెర్కెక్కించిన ఓ సినిమాలో హీరోని చేస్తానని మాట ఇచ్చి మరి తప్పారట. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరోగా వేటగాడు సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రంభ, సౌందర్య హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఈ సినిమాలో ముందుగా హీరోగా శ్రీకాంత్‌ను అనుకున్నారట. భరద్వాజ ఈ విషయాన్ని శ్రీకాంత్ కి కూడా చెప్పారట.
నువ్వు ఇప్పుడు ఏ సినిమాలకు అయితే కమిట్ అయ్యావో… అవన్నీ పూర్తి చేసి నా దగ్గరికి వచ్చేయ్… నా వేటగాడు సినిమాలో హీరోగా నువ్వు చేస్తున్నానని చెప్పడంతో శ్రీకాంత్ అలాగే చేశారట. అయితే చివర్లో భరద్వాజ తనకు షాక్ ఇచ్చి రాజశేఖర్‌ను హీరోగా పెట్టుకోవడంతో తాను చాలా బాధపడ్డానని… అయితే భరద్వాజ అంటే తనకు ఎప్పటికీ అభిమానమే అని శ్రీకాంత్ అన్నారు. తాను విలన్ వేషాలు వేస్తున్నప్పుడు తనను ఆయన వన్ బై టు – మిస్టర్ రాస్కెల్ లాంటి సినిమాలలో మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారని శ్రీకాంత్ చెప్పాడు.