Moviesఅయ్యాయ్యో..మళ్లీ దొరికిపోయావే..గాడ్ ఫాదర్ మ్యూజిక్ ఆ సినిమాకు కాపీనా ..!?

అయ్యాయ్యో..మళ్లీ దొరికిపోయావే..గాడ్ ఫాదర్ మ్యూజిక్ ఆ సినిమాకు కాపీనా ..!?

“అయ్యయ్యో… తమన్ చూసుకోవాలి కదా.. ఏంటి తమ్ముడు ఇలాంటి పనులు.. ఏందిరా సామి కొట్టిందే మళ్ళీ కొట్టావ్… కాఫీ రాజా చూసుకోలేదా..” ఎస్ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ నే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రతి మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసింది తమన్ నే. ఆయన మ్యూజిక్ లో అదేదో తెలియని మాయ ఉంటుంది.

తమన్ డ్రమ్‌స్ కొడితే థియేటర్ లల్లో సీన్ దద్దరిల్లిపోవాల్సిందే. అలా ఉంటది తమన్ మ్యూజిక్ మాయ. బిగ్ బిగ్ స్టార్స్ కూడా తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ నే కావాలి అంటూ ఏరి కోరి ఆయన కోసమే ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి నెలకొంది. కాగా రీసెంట్ గా తమన్ మ్యూజిక్ ఇచ్చిన సినిమా గాడ్ ఫాదర్. మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న చిరంజీవి సినిమాకు సంబంధించిన అప్డేట్ నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు మేకర్స్. మలయాళీ బ్లాక్ బస్టర్ లూసీఫర్ సినిమాను చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నయనతార కీలకపాత్ర పోషిస్తుంది. తెలుగులో గాడ్ ఫాదర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ నిన్న సాయంత్రం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్.


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో ఓ స్పెషల్ పాత్ర పోషించినట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించారు. ఓవైపు నయనతార మరోవైపు మెగాస్టార్ మధ్యలో కండలు వీరుడు సల్మాన్ ఖాన్ ఇంతమంది క్రేజీ స్టార్స్ ఉంటే ఆ సినిమా ఎలా ఉంటది. టాప్ లేచిపోవాల్సిందే..! ఈ క్రమంలోనే ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మెగా అభిమానులు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విజయదశమి కానుకగా అక్టోబర్ 5వ తేదీ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అయితే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా నిన్న సాయంత్రం రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది .

ముఖ్యంగా చిరంజీవి లుక్స్ సినిమాకు ప్లస్ గా నిలిచాయి . అంతేకాదు కంటెంట్ సినిమాకు మరో ప్లస్ గా నిలిచింది. అయితే అన్ని బాగున్నా సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం మెగా అభిమానులను తీవ్రంగా హర్ట్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే ఆ సినిమాకి ఎంత క్రేజ్ ఉంటుందో అంతే భయం ఉంటుంది. తనకి ఇండస్ట్రీలో మరో పేరు కూడా ఉంది కాపీ రాజా అంటూ ముద్దుగా పిల్చుకుంటుంటారు. అయితే గాడ్ ఫాదర్ విషయంలోనూ తమన్ తప్పు చేసినట్లు తెలుస్తుంది మెగా హీరో వరుణ్ తేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన గనీ మూవీ సినిమా మ్యూజిక్ లానే ఉంది గాడ్ ఫాదర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు. నిజానికి గనీ సినిమా చూసిన వారికి ఎవరికైనా గాడ్ ఫాదర్ టీజర్ చూస్తే అదే అనిపిస్తుంది. సేమ్ టు సేమ్ డిట్టో దించేసినట్లు ఉన్నాడు. దీంతో ట్రోలర్స్ ఓ ఆట ఆడేసుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news