సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య మనం గుడ్ న్యూస్ లు చాలా ఎక్కువగా వింటున్నాం. యంగ్ హీరో హీరోయిన్స్ పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాళ్ళు అయ్యారు . అదేవిధంగా మరికొందరు ఏమో ప్రెగ్నెన్సీ న్యూస్ చెప్పి తీపి కబురు అందించారు. ఇప్పటికే బాలీవుడ్ , కోలీవుడ్ బ్యూటీస్ అందరూ ప్రెగ్నెన్సీ విషయాలు చెప్పి అభిమాన ఉత్సాహపరుస్తున్నారు. ఈ క్రమంలోనే టెలివిజన్ నటులు డెబినా బెనర్జీ..గుర్మిత్ చౌదరి గుడ్ న్యూస్ చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఫస్ట్ టైం గుడ్ న్యూస్ చెప్పిన నాలుగు నెలలకే మళ్ళీ గుడ్ న్యూస్ చెప్తే ..అది నిజంగా షాకింగ్ ఏ కదా.. ఇప్పుడు అలాంటి షాకింగ్ విషయాన్ని చెప్పారు ఈ జంట.
టెలివిజన్ హాట్ కపుల్ డెబినా బెనర్జీ ..గుర్మిత్ చౌదరి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈమధ్యనే వాళ్లు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు నెలలకే మళ్లీ గుడ్ న్యూస్ చెప్పడం అభిమానులకు షాకింగ్ అనిపించింది. కేవలం వాళ్ళు వాళ్ళ రెండో బిడ్డకి నాలుగు నెలలు మాత్రమే గ్యాప్ తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నిలిచింది.
డెబినా చౌదరి..గుర్మిత్ చౌదరి వాళ్ళ రెండో బిడ్డకి మరి కొద్ది నెలలోనే జన్మనివ్వబోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ కొందరు వారిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళి ఈ తీపి కబురును అధికారికంగా ప్రకటించే టైంలోనే తమను టార్గెట్ చేసి హింసించడం బాధాకరమంటూ డెబినా బెనర్జీ గుర్మిత్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు మాట్లాడుతూ ..”ఇలాంటి గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకోవడానికి మేము వెయిట్ చేస్తున్నాం. కాని వాళ్ళు మమ్మల్ని దారుణంగా టోల్ చేస్తున్నారు. ఈ గుడ్ న్యూస్ మేము మా ఇంట్లో వాళ్లకు చెప్పినప్పుడు శభాష్ అన్నారు. మమ్మల్ని ఆశీర్వదించారు. కానీ మీరేమో ఇలా మమ్మల్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఏది మన చేతుల్లో లేదు. ఆ దేవుడి నిర్ణయం మనం మార్చలేము కదా. దేవుడు మాకు ఇవ్వాలనుకుంటున్నాడు అందుకే సంతోషిస్తున్నాం. అలాగే మా మొదటి బిడ్డ కోసం ఐదేళ్లు కష్టపడ్డాం. కానీ రెండో బేబీకి ఇంత త్వరగా మోక్షం కలగడం ఆ దేవుడిచ్చిన వరం”.. అంటూ చెప్పుకొచ్చారు.