Moviesటాప్ పొలిటీషియన్ కి దిమ్మ తిరిగిపోయే షాకిచ్చిన సాయి పల్లవి ..ఇంత...

టాప్ పొలిటీషియన్ కి దిమ్మ తిరిగిపోయే షాకిచ్చిన సాయి పల్లవి ..ఇంత ధైర్యం ఎంట్రా బాబు..!?

యస్..ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా దూసుకుపోతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా స్టేటస్ సంపాదించుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మలర్ బ్యూటీగా ఇండస్ట్రీలో ఒక్కసారిగా కొత్త చరిత్ర సృష్టించింది. అప్పటివరకు హీరోయిన్స్ అంటే ఎక్స్పోజింగ్.. ముఖానికి రంగులు వేసుకోవడానికి మాత్రమే పనికొచ్చేవాళ్ళు అనే ఒక అపోహ ఉండేది. కానీ సాయి పల్లవి సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి హీరోయిన్ అనే పదానికి అర్థం మార్చేసింది. బ్యూటీ అంటే కేవలం శరీరానికి సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది కూడా అంటూ హీరోయిన్స్ కి తెలిసి వచ్చేలా చేసింది.


సాయి పల్లవి ఇప్పటివరకు చేసిన సినిమాలు చూస్తే ఏ సినిమాలోను ఎక్స్పోజింగ్ చేయలేదు. ఏ సినిమాలోను హద్దులు మీరు నటించలేదు. ఎందుకంటే సాయి పల్లవి అలాంటి లిమిట్స్ పెట్టుకొని నటించడానికి ఇండస్ట్రీకి వచ్చింది. నటిస్తే డబ్బులు వస్తాయి అని సాయి పల్లవి అనుకోవడం లేదు. డబ్బుల కోసం సాయి పల్లవి నటించడం లేదు. తనకు నటన పట్ల ఉన్న ఆసక్తి కారణంగానే నటిస్తుంది. లేకపోతే సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు తిరిగి ఇచ్చే హీరోయిన్స్ ఈ కాలంలో ఉన్నారా..? సినిమాకు ముందే డబ్బులు నాకు ఇచ్చేయాలి అని పట్టుపట్టే హీరోయిన్స్ ఉన్న ఈ కాలంలో సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ దొరకడం అదృష్టం అనే చెప్పాలి.


అయితే ఉన్నది ఉన్నట్టు ఫేస్ మీద మాట్లాడే అలవాటు ఉన్న సాయి పల్లవి.. టాప్ పొలిటీషియన్ కి ఊహించిన షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే సాయి పల్లవి అందం ముందు ఏ హీరోయిన్స్ పనికిరారు. చక్కగా అందంగా చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. నో మేకప్ ఫిల్టర్స్ తో సాయి పల్లవి చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మరి అలాంటి అందాన్ని వదులుకోవడానికి ఎవరైనా ట్రై చేస్తారా..? ఎవ్వరూ ఒప్పుకోరు.సాయి పల్లవి అందంపై మోజుపడ్డ పొలిటీషియన్ కొడుకు సాయి పల్లవి ని పెళ్లి చేసుకోవడానికి సంబంధం మాట్లాడడానికి వాళ్ళ నాన్నని సాయి పల్లవి ఇంటికి పంపించారట . ప్రస్తుతం ఇదే న్యూస్ మీడియాలో వైరల్ గా మారింది .

అయితే సాయి పల్లవి మాత్రం ఆ ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేసిందంట. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. పైగా పొలిటిషీయన్ కొడుకుని అస్సలు చేసుకొని.. ఆయన ఫేస్ మీదే చెప్పి షాక్ ఇచ్చిందట. అంతేకాదు ఇంటికి వచ్చిన పొలిటిషీయన్ కి మర్యాదలు చేసి చాలా గౌరవంగానే రిజెక్ట్ చేసిందట. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు “టాప్ పొలిటిషన్ కి షాక్ ఇచ్చే ధైర్యం ఉందా ఈ పిల్లకి “అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు “ఇంత ధైర్యం ఏంటి పాప నీకు” అంటూ..” ఏది ఏమైనా మనసులో ఉన్న మాట నిజాయితీగా చెప్పడం గ్రేట్ హ్యాట్సాఫ్ సాయి పల్లవి “అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news