Moviesఅలాంటి పిల్ల నాకొద్దు..స్టార్ డాటర్ పరువు తీసిన విజయ్ దేవరకొండ..!!

అలాంటి పిల్ల నాకొద్దు..స్టార్ డాటర్ పరువు తీసిన విజయ్ దేవరకొండ..!!

విజయ్ దేవరకొండ.. ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ లో సెన్సేషన్ గా వినిపిస్తుంది. పెళ్లిచూపులు సినిమాతో సైలెంట్ క్లాసిక్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో ..అర్జున్ రెడ్డితో తనపై పెట్టుకున్న ఆశలను అన్ని తిరగరాసాడు. ఒక్క సినిమాతో తన జాతకాన్ని తానే మార్చేసుకున్న రౌడీ హీరోనే ఈ విజయ్ దేవరకొండ. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు.. యంగ్ హీరోలు కూడా ఉన్నారు.. కానీ విజయ్ దేవరకొండ లాంటి హీరో లేడనే చెప్పాలి. ఆయన స్టైల్ ఆయన యాటిట్యూడ్.. ఆయన పొగరు.. ఆయన మాటతనం.. ఆయన డేరింగ్ నెస్.. ఏ హీరోకి లేదు అనే చెప్పాలి.

ప్రజెంట్ ఈ యంగ్ హీరో పాన్ ఇండియా సినిమాతో మనం ముందుకు రాబోతున్నాడు. టాలీవుడ్ స్టార్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమానే లైగర్ . ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొన్నారు. మరి ముఖ్యంగా ఈ సినిమా తెలుగులో కన్నా కూడా బాలీవుడ్ లో రేంజ్ లో వెళ్ళిపోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని సినిమాపై భార్రీ అంచనాలు పెట్టుకునేలా చేసింది . ఆగస్టు 25న ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది . ఈ క్రమంలోనే లైగర్ సినిమాకు ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు మూవీ టీం.


కాగా లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ రీసెంట్ గా పాల్గొన్న ఇంటర్వ్యూలో హీరోయిన్ అనన్య పాండే గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇంటర్వ్యూలో రాపిడ్ ఫైర్ క్వశ్చనస్ అడుగుతున్న క్రమంలో హోస్ట్ అనన్య పాండే గురించి ఓ ప్రశ్న అడిగాడు. “మీకు అనన్య పాండే తో నటించడం ఎలా ఉంది. ఆమెతో నటించడం మీకు ఇబ్బందిగా అనిపించిందా..? అని అడిగేసరికి విజయ్ దేవరకొండ ఇచ్చిన ఆన్సర్స్ కి జనాలు షాక్ అయ్యారు. విజయ్ మాట్లాడుతూ..” అనన్య ఎప్పుడు ఏదో ప్రశ్న అడుగుతూనే ఉంటుంది షూటింగ్ లో చాలా చిరాకు తెప్పించింది కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఇలాంటి అల్లరి పిల్ల నాకు పుడితే ఏం చేయాలో అని”.. అదేవిధంగా అనన్యలు మీకు నచ్చే లక్షణం ఏంటి అని అడగ్గా..” అనన్య చాలా డిఫరెంట్ ఎప్పుడు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఆమెలో ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news