టాలీవుడ్లో అక్కినేని నాగార్జున గురించి కొన్ని విషయాలలో ఎంత ప్రత్యేకంగా మాట్లాడుకుంటారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అన్నపూర్ణ నిర్మాణ సంస్థలో కొత్త వారికి ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. 24 విభాగాలకు చెందిన వాళ్లలో కొత్త టాలెంట్నునాగ్ ఎక్కువగా బయట పెడుతుంటారు. ఇండస్ట్రీకి చాలా మంది కొత్త టాలెంట్‌ను పరిచయం చేసింది అన్నపూర్ణ ప్రొడక్షన్స్ అని చెప్పక తప్పదు. టాలీవుడ్‌కి దర్శకుడిగా చాలామంది కొత్తవారిని పరిచయం చేశారు. అనుష్క శెట్టి లాంటి అందగత్తెను పరిచయం చేసింది నాగార్జునే.
ఇక నాగార్జున అంటే టాలీవుడ్ కింగ్, మన్మథుడు అని అందరూ పిలుస్తుంటారు. దీనికి కారణం ఆయనతో హీరోయిన్స్ ఎక్కువగా సన్నిహితంగా ఉంటారని చెప్పుకుంటుంటారు. అందుకే నాగ్‌ను అమ్మాయిల కలల రాకుమారుడిగా పిలుస్తుంటారు. నిన్నే పెళ్ళాడతా సినిమాలో నాగార్జున సరసన నటించిన టబు అప్పటి నుంచి ఇప్పటివరకు నాగార్జునతో చాలా క్లోజ్‌గా ఉంటుందని చాలామందికి తెలిసిందే. టబుకి ఇల్లు కూడా అమల దగ్గరుండి కట్టించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత శ్రియ, అనుష్క శెట్టి లాంటి హీరోయిన్స్‌తో బాగా క్లోజ్‌గా ఉన్నారని చెప్పుకున్నారు.
నాగార్జున కాదు, హీరోయిన్ ఎవరైనా ఆయనంటే పడి చస్తుంటారని టాక్ ఉంది. ఇక కొంతమంది హీరోయిన్లతో నాగ్ అత్యంత సన్నిహితంగానూ ఉంటారట. ఆ లిస్ట్‌లో బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితా సేన్ కూడా ఉన్నారు. రక్షకుడు సినిమాలో నాగ్ సరసన హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరు ప్రైవేట్‌గా కలిసుకునేవారని… మరీ తప్పనిసరిగా కలుసుకోవాలంటే నాగ్ సీక్రెట్‌గా ముంబైకే వెళ్ళేవారని అప్పట్లో ప్రచారం జరిగింది.
అప్పట్లో సుస్మిత జోయ్ అలుకాస్ జువెల్లరీ యాడ్ ఫిలింలో నటించింది. హైదరాబాద్ ఈ యాడ్ షూట్ కోసం వచ్చింది సుస్మిత. అప్పట్లో తనకున్న క్రేజ్ కారణంగా పెద్ద పెద్ద వీఐపీలకు కూడా అనుమతి ఇవ్వలేదట. కానీ, రిక్వెస్ట్ చేస్తే ఒక్క నాగార్జున ఆమెతో మాట్లాడేందుకు ఓ గంట మాత్రమే కలుసుకునే ఛాన్స్ ఇచ్చారట. ఆ గంట నాగార్జున – సుస్మితా సేన్ ప్రైవేటుగా కలుసుకొని మాట్లాడుకున్నారట. నాగ్ తలుచుకుంటే హీరోయిన్ని ఎలాగైనా కలుసుకుంటాడనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పుకున్న సందర్భాలూ ఉన్నాయి.