Moviesసినిమాల్లోకి రాక‌ముందు ' ర‌మ్య‌కృష్ణ ' ఏం చేసిందో తెలుసా...!

సినిమాల్లోకి రాక‌ముందు ‘ ర‌మ్య‌కృష్ణ ‘ ఏం చేసిందో తెలుసా…!

టాలీవుడ్‌లో అందం అభినయంతో ఆకట్టుకున్న నటీమణుల్లో రమ్యకృష్ణ కూడా ఒకరు. ఎలాంటి పాత్ర అయినా రమ్యకృష్ణ చేసింది అంటే థియేటర్ల‌లో క్లాప్స్ పడాల్సిందే. సాధారణంగా హీరోయిన్లు నెగిటివ్ రోల్ లో నటించడం సాహసం అనే చెప్పాలి. కానీ రమ్యకృష్ణ మాత్రం కెరీర్ పీక్స్ లో ఉన్న సమయం కూడా నెగిటివ్ రోల్స్ కు సై అంది. రజినీకాంత్ హీరోగా నటించిన నరసింహ సినిమాలో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్ర సినిమాకు ప్రాణం పోసింది. ఇప్పటికీ రమ్య కృష్ణ చేసిన ఆ పాత్రను ప్రేక్షకులు మర్చిపోలేదు. ఆ తరవాత రమ్యకృష్ణ విభిన్న పాత్రల్లో నటించింది.

 

అప్పట్లో బికినీ వేసి కూడా కుర్రాళ్ళ మతులు పోగొట్టింది. ఇక బాహుబలి సినిమాలో నటించి రమ్యకృష్ణ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. బాహుబ‌లిలో రాజ‌మాత శివ‌గామి దేవి పాత్ర‌లో ర‌మ్య న‌ట విశ్వ‌రూపం ఇండియ‌న్ సినిమా ప్రేక్ష‌కుడిని కూడా మంత్ర ముగ్ధుల‌ను చేసేసింది. రీసెంట్ గా లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకు తల్లిగా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫోటో షూట్ చేయగా ఆ ఫోటో షూట్ లోనూ గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసింది. అంతే కాకుండా లేటు వయసులోనూ స్విమ్మింగ్ పూల్ లో బికినీ వేసుకుని ఫోటో లకు ఫోజులు ఇచ్చింది.

ఇక రమ్యకృష్ణ పర్సనల్ లైఫ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమాల్లో హీరోయిన్ గా రాణించిన రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకుంది. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన చంద్ర‌లేఖ సినిమా టైంలోనే వీరి మ‌ధ్య ప్రేమ చిగురించింది. ప్ర‌స్తుతం రమ్యకృష్ణ – కృష్ణవంశీ చెరో దారిలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. రమ్యకృష్ణ చెన్నైలో ఉంటే కృష్ణవంశీ మాత్రం హైద‌రాబాద్‌లో ఉంటూ ట్రైల్స్ వేస్తున్నారు. రమ్యకృష్ణ నేరుగా హీరోయిన్ గానే అవకాశాలు అందుకోలేదు. మొదట డ్యాన్సర్ గా కెరీర్ ను ప్రారంభించింది. సినిమాల్లోకి రాకముందు స్టేజ్ షోలు సైతం చేసింది.

అదేవిధంగా నాటకాల్లో కూడా నటించేది. డ్యాన్స్ అంటే ఉన్న పిచ్చితో భ‌ర‌త నాట్యం, కూచిపూడి నేర్చుకుంది. డ్యాన్సర్ గా పేరు సంపాదించుకున్న తరవాత రమ్య భలే మిత్రులు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక అక్షింతలు సినిమాతో రమ్యకృష్ణ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తరవాత కెరీర్‌లో వెనక్కి తిరిగి చుస్కోలేదు. మరి విడుదలకు సిద్దంగా ఉన్న లైగర్ రమ్యకృష్ణ కు ఎలాంటి ? విజయాన్ని ఇస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news