Moviesఇండియాలో అతి పెద్ద 10 థియేట‌ర్లలో 6 హైద‌రాబాద్‌లోనే ఉన్నాయ్ మీకు...

ఇండియాలో అతి పెద్ద 10 థియేట‌ర్లలో 6 హైద‌రాబాద్‌లోనే ఉన్నాయ్ మీకు తెలుసా..!

ఒకప్పుడు తెలుగు గడ్డపై ఏకంగా మూడు వేలకు పైగా థియేటర్లు ఉండేవి. 1990 – 2000వ ద‌శ‌కంలో భారత దేశంలోనే ఎక్కువ థియేటర్లు అప్పటి సమైక్య రాష్ట్రంలో ఉండేవి. ప్రతి మండల కేంద్రం నుంచి ఒక మోస్త‌రు మేజర్ పంచాయతీ వరకు.. చివరకు చిన్నచిన్న పల్లెటూర్లలో సైతం థియేటర్లు ఉండేవి. చివరకు టూరింగ్‌ టాకీసులు అయినా నడిపేవారు. అప్ప‌ట్లో కొత్త సినిమాలు పట్టణాలు, నగరాలలో రిలీజ్ అయితే ఆ తర్వాత ఐదారు నెలలకు అవి చిన్న చిన్న పల్లెటూర్లలో థియేటర్లలో ప్రదర్శించేవారు. అప్పట్లో రిలీజ్ అయిన సినిమాలు 50 రోజులు – 100 రోజులు – 200 రోజులు – సంవత్సరం పాటు ఆడేవి.

అయితే ఇప్పుడు సీన్‌ మారిపోయింది. చిన్న చిన్న పల్లెటూర్లలో సైతం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎంత పెద్ద హిట్ సినిమా అయినా వారం రోజులకు మించి ఆడటం లేదు. ఇప్పుడున్నది అంతా డిజిటల్ యుగం. మరోవైపు శాటిలైట్, టీవీ ఛానల్స్ ఓటిటి దెబ్బకు థియేటర్లు కుప్పకూలిపోయాయి. దీనికి తోడు మల్టీప్లెక్స్ దెబ్బకు సింగిల్ స్క్రీన్లు దారుణంగా మూత పడిపోయాయి. ఒకప్పుడు నాటి సమైక్య రాష్ట్రంలో 3000 థియేటర్లు ఉండగా… ఇప్పుడు వాటి సంఖ్య 1800కు పడిపోయింది. ఇంకా చెప్పాలంటే చాలా సింగిల్ స్క్రీన్ల‌ను మల్టీప్లెక్స్‌లుగా మార్చేస్తున్నారు.

అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లు వ్యవస్థ బతికి బట్ట కట్టడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. మరో ఐదారు సంవత్సరాలలో మరిన్ని సింగల్ స్క్రీన్ థియేటర్లు మూత పడతాయని అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ సినిమా వినోదానికి పెట్టింది పేరు. టాలీవుడ్ అక్క‌డే ఉండ‌డంతో ఇక్క‌డ సినిమా ప‌రిశ్ర‌మ గ‌త కొన్నేళ్లుగా మూడు పువ్వులు ఆరుకాయ‌లుగా వ‌ర్థిల్లుతోంది. ఒక‌ప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోనే అంతా పండ‌గ వాతావ‌ర‌ణం ఉండేది.

సినిమా రిలీజ్ అవుతోందంటే అక్క‌డ పెద్ద సంద‌డే ఉండేది. అయితే ఇప్పుడు రాను రాను ఆ ప్రాభ‌వం త‌గ్గి కూక‌ట్‌ప‌ల్లి వైపు ఈ సంద‌డి పెరుగుతోంది. ఇక హైద‌రాబాద్ సినీ చరిత్ర‌, థియేట‌ర్ల వైభ‌వం ఎంత గొప్ప‌ది అంటే మ‌న‌దేశంలో ఎక్కువ కెపాసిటీ ఉన్న అతి పెద్ద 10థియేట‌ర్ల‌లో 6 థియేట‌ర్లు ఇక్క‌డే ఉన్నాయి. ఆ లిస్ట్ ఓ సారి చూద్దాం.

ఇండియాలో టాప్ కెపాసిటీ ఉన్న టాప్ 10 థియేట‌ర్లు :
1- మ‌నోజ్ థియేట‌ర్ – అస‌న్‌సోల్ ( ముంబై ) 1626 సీట్లు
2- సంధ్య 70 ఎంఎం – ఆర్టీసీ క్రాస్ రోడ్స్ – హైద‌రాబాద్ – 1323 సీట్లు
3- రంగ – జీడిమెట్ల – హైద‌రాబాద్ – 1306 సీట్లు
4- దేవి 70 ఎంఎం, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ – హైద‌రాబాద్ – 1306 సీట్లు
5- ఉడ్ ల్యాండ్ థియేట‌ర్ – చెన్నై – 1297 సీట్లు
6- భుజంగ, జీడిమెట్ల – హైద‌రాబాద్ – 1292 సీట్లు
7- సుద‌ర్శ‌న్ 35 ఎంఎం, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ – హైద‌రాబాద్ – 1216 సీట్లు
8- స‌రితా సినిమా, కోచి – 1195 సీట్లు
9- విశ్వ‌నాథ్‌, కూక‌ట్‌ప‌ల్లి, హైద‌రాబాద్ – 1177 సీట్లు

ఇలా టాప్ 9లో చూస్తేనే సంధ్య 70 ఎంఎం, రంగ‌, భుజంగ‌, సుద‌ర్శ‌న్ 35 ఎంఎం, దేవి, విశ్వ‌నాథ్ 6 టాప్ కెపాపిటీ ఉన్న థియేట‌ర్లు మ‌న న‌గ‌రంలోనే ఉన్నాయి.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news