సినీ ఇండస్ట్రీలో కి హీరోయిన్ గా రావడం చాలా కష్టం..వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం మహా కష్టం. అలా వచ్చిన ఆఫర్స్ ని లడ్డు లా పట్టుకుని..తెలివితేటలతో నెట్టుకువస్తేనే స్టార్ హీరోయిన్ గా మారగలరు. ఈ గ్లామరస్ ప్రపంచంలో అందం గా ఉన్నా కానీ కాస్తో కూస్తో టాలెంట్ ఉండాలి..లేకపోతే పైకి రాలేము. అలా అందం , టాలెంట్, అదృష్టం మూడు ఉన్నా కానీ ఈ హీరోయిన్ పాప..స్టార్ హీరోయిన్ గా మారలేకపోయింది. దానికి రీజన్ అమ్మడు చేసిన తప్పే..
స్వాతీ అంటే పెద్దగా గుర్తు పట్టలేకపోవచ్చు కానీ..కలర్స్ స్వాతీ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఆ నవ్వు..ఆ సొట్ట..ఆ చిలిపి అల్లరి..ఆ అమాయకపు ఫేస్ మర్చిపోగలమా..? తన క్యూట్ క్యూట్ స్మైల్ తో బుల్లితెర యాంకర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన ఈ అమ్మడు..కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా..పాపులర్ అయ్యింది. ఆ ఫాం తోనే సినిమాలో అవకాశాలు దక్కించుకుని..హిట్ కొట్టింది. పలు చిన్న సినిమాల్లో అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ..కెరీర్ మొదట్లో నే..బబ్లీ గా కనిపించి ఆకట్టుకుంది.
ఆ తరువాత రాను రాను..స్వాతీ బాడీ లో మార్పులు వచ్చాయి. ఫేస్ ముదిరిపోయిన్నట్లు..పెద్ద మనిషిలా కనిపిస్తూ వచ్చేది. ఆమె తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే..ఇప్పుడు ఖచ్చితంగా సెకండ్ హీరోయిన్ ఛాన్సులు అయినా అందుకునేది. ఒకప్పటి స్వాతీని ఇప్పటి స్వాతీని మీరు కంపేర్ చేసి చూస్తే ఆ విషయం మీకు బాగా అర్ధమవుతుంది. పైగా కెరీర్ మొదట్లో మంచి మంచి ఆఫర్స్ ను చేతులారా వదిలేసుకుంది స్వాతీ. తెలిసో తెలియకో చేసిన తప్పే ఇప్పుడు ఆమె సినీ జీవితానికి శాపంగా మారింది. మరి చూడాలి అమ్మడికి అవకాశం ఇచ్చే డైరెక్టర్ ఎక్కడున్నాడో..?