నందమూరి కళ్యాణ్ రామ్ గురించి… ఆయన గట్స్ గురించి ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంది. తాత నందమూరి తారక రామారావు పేరు మీద ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ అని బ్యానర్ స్థాపించి ఈ సంస్థలో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే, తన సంస్థ ద్వారా కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వస్తున్నారు. అతనొక్కడే సినిమాతో సురేందర్ రెడ్డి నుంచి ఇప్పటి బింబిసార వరకు మల్లిడి వశిష్ట్‌తో సహా చాలామందిని దర్శకులుగా పరిచయం చేశారు.
కళ్యాణ్ రామ్ తన సినిమాల ద్వారా కొందరు హీరోయిన్స్‌ను కూడా టాలీవుడ్‌కి పరిచయం చేశారు. వారిలో అతనొక్కడే సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైన సింధు తులాని. సాధారణంగా సినిమా ప్రారంభంలో ఏ దర్శకుడైనా హీరోను పరిచయం చేస్తాడు. ఓ ఎలివేషన్ ఇస్తాడు. భారీ స్థాయిలో బిల్డప్ ఇచ్చి హీరో ఇంట్రడక్షన్ ప్లాన్ చేస్తాడు. కానీ, ఇక్కడ కళ్యాణ్ రామ్ కథను నమ్మి సినిమా చేసే వ్యక్తి. దర్శకుడిని నమ్మి సినిమా బాధ్యత అప్పింగించే వ్యక్తి. అందుకే, ఇంతమంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
ఇక అతనొక్కడే సినిమాలో హీరోయిన్ ఇంట్రడక్షన్స్ తో సినిమా మొదలవుతుంది. ఇది కన్విన్స్ చేయడం చాలా కష్టం. కానీ, సురేందర్ రెడ్డి చేయగలిగాడు. ఆడియన్స్ ని మెప్పించాడు. ఇక మొదటి సినిమాతో మంచి పర్ఫార్మర్గా పేరు తెచ్చుకుంది. అతనొక్కడే తర్వాత టాలీవుడ్లో వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. సింధు తులాని కూడా ఇదే అనుకుంది. కానీ, అలా జరగలేదు. దీనికి ముఖ్య కారణం పెద్ద హీరోలకు సూటయ్యే హైట్ అండ్ పర్సనాలిటీ తన దగ్గర లేకపోవడమే.
తమిళంలో శింబు హీరోగా వచ్చిన మన్మధ సినిమాలో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్. అయినా అక్కడ కూడా పెద్ద హీరోల సరసన సినిమాలు చేయలేకపోవడానికి కారణం ఇదే అని చెప్పాలి. టాలెంట్ ఒక్కటుంటే సరిపోదు. హీరోయిన్ అన్న తర్వాత అందరు హీరోల సరసన నటించడానికి కావాల్సిన ఎక్స్ ట్రా క్వాలిటీస్ చాలా ఉంటాయి. అవి లేకపోతే సింధు తులాని మాదిరిగానే మిగిలిపోతారు. దుబాయ్ శీను లాంటి సినిమాలలో క్యారెక్టర్ చేసినా తన కెరీర్ ఎలా క్లోజ్ అయిందో అందరికీ తెలిసిందే.