నటసింహం బాలకృష్ణ సినిమాల టైటిల్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, నరసింహానాయుడు, యువరత్న రాణా, సీమసింహం, రూలర్, జైసింహా, పలనాటి బ్రహ్మనాయుడు, లయన్, డిక్టేటర్, సింహా, లెజెండ్, అఖండ ఇలా అన్నీ చాలా పవర్ ఫుల్‌గా ఉంటాయి. ఈ వయస్సులో కూడా బాలయ్య కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు.
అఖండ సక్సెస్ తర్వాత ప్రస్తుతం బాలయ్య వరుసగా క్రేజీ ప్రాజెక్టులే చేస్తున్నాడు. మలినేని గోపీచంద్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి, ఆ తర్వాత పూరి, బోయపాటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇదిలా ఉంటే బాలయ్య సినిమాల టైటిల్స్‌లో ఓ లాజిక్ ఉంది. బాలయ్యతో ఓ సినిమాలో నటించిన ఓ హీరోయిన్ చెప్పిన డైలాగులనే వరుసగా బాలయ్య సినిమాలకు టైటిల్స్‌గా పెట్టడం విచిత్రంగా జరుగుతూ వస్తోంది.
బాలయ్య లెజెండ్ సినిమాలో రాధికా ఆఫ్టే హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో రాధిక బాలయ్య పాత్రను ఉద్దేశించి కొన్ని డైలాగులు చెపుతుంది. అతను ఒక లయన్, ఒక డిక్టేటర్, ఒక రూలర్ అంటూ డైలాగులు పవర్ ఫుల్‌గా చెపుతుంది. ఆ తర్వాత ఈ డైలాగుల్లో ఉన్న పదాలే వరుసగా బాలయ్య సినిమాలకు టైటిల్స్‌గా వచ్చాయి. 2014లో లెజెండ్ వస్తే.. ఆ మరుసటి యేడాది 2015లో లయన్ సినిమా వచ్చింది.
2016 సంక్రాంతికి డిక్టేటర్ వచ్చింది. నాలుగు సినిమాల పోటీలో వచ్చిన ఈ సినిమా కూడా హిట్ అయ్యింది. ఆ తర్వాత కేఎస్. రవికుమార్ దర్శకత్వంలో క్రిస్మస్కు రూలర్ సినిమా వచ్చింది. ఈ సినిమా కథానాయకుడు, మహానాయకుడు సినిమాల తర్వాత భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయ్యింది. అలా ఆ హీరోయిన్ చెప్పిన డైలాగును బట్టే ఏకంగా బాలయ్య మూడు సినిమాలకు టైటిల్స్‌గా పెట్టారు.