Moviesనా సెక్స్ లైఫ్ లో అవి లేవుగా..అందుకే కరణ్ "కాఫీ షో"...

నా సెక్స్ లైఫ్ లో అవి లేవుగా..అందుకే కరణ్ “కాఫీ షో” కి పిలవలేదు..తాప్సీ పగిలిపోయే ఆన్సర్..!!

హీరోయిన్ తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీద మాట్లాడే హీరోయిన్స్ సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ. అలాంటి వాళ్లల్లో ఈ తాప్సీ కూడా ఒకరు. ఝుమ్మంది నాదం సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ..ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో ఉది. అక్కడ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అంటే తాప్సీ నే గుర్తుకు వస్తుంది..దర్శక నిర్మాతలకి. అంతేకాదు, రెమ్యూనరేషన్ కూడా బాగానే పెంచేసింది.

ప్రజెంట్ అమ్మడు మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ ‘శభాష్ మిథు’ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాలో అమ్మడు నటన అందరిని ఆకట్టుకుంది. కాగా ఆగష్టు 19న తాప్సీ నటించిన మరో చిత్రం ‘దొబారా’ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాప్సీ వరుస ఇంటర్వ్యులకు హాజరు అవుతుంది. ఈ క్రమంలోనే మీడియా తో ముచ్చటించిన తాప్సి..మల్టీ టాలెంటెడ్ కరణ్ జోహర్ గురించి..సంచలన కామెంట్స్ చేసింది. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు ‘కాఫీ విత్ కరణ్’ షోకి వెళ్లలేదా అని మీడియా ప్రతినిధులు తాప్సి ని ప్రశ్నించారు.

అంతే, వాళ్ల ఫేస్ మీదనే…బోల్డ్ ఆన్సర్ ఇచ్చి షాకిచ్చింది. “నా సెక్స్ లైఫ్ లో కొత్తగా ఏం లేదుగా..అందుకే ఆ షో నుండి ఆహ్వానం అందుకోలేదు. అంత ఆసకతికర శృంగార అంశాలు నా దగ్గర లేవు” అంటూ కరణ్ పై పరోక్షంగా మండిపడింది. ఈ మధ్య మనం కరణ్ ఇంటర్వ్యులు చూస్తే వరుసగా అన్ని సెక్స్ ప్రశ్నల గురించే అడుగుతున్నాడు. మొన్న విజయ్ దేవరకొండ, నిన్న అమీర్ ఖాన్ , కరీనా కపూర్ ని..ఇలా షో కి పిలిచిన వారందరని వాళ్ళ సెక్స్ లైఫ్ గురించి అడిగి ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఇప్పుడు తాప్సీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి చూడాలి దీని పై కరణ్ ఎలా స్పందిస్తారో..!?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news