Moviesఅమ్మ బాబోయ్..భారీ గా పెంచేసిన రష్మిక..ఇక కష్టమే..!?

అమ్మ బాబోయ్..భారీ గా పెంచేసిన రష్మిక..ఇక కష్టమే..!?

యస్..ఇప్పుడు దర్శక నిర్మాతలు ఇదే అంటున్నారు. నిన్న మొన్నతి వరకు బాగానే ఉన్న ఈ బ్యూటీ సడెన్ గా ఇలా పెంచేస్తే ఎలా..అంటూ తిడుతున్నారు. ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ..ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. వచ్చిన సినిమాలో నచ్చిన మూవీస్ కు సైన చేస్తూ అమ్మడు టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లిపోయింది. ప్రజెంట్ అమ్మడి చేతిలో దాదాపు 8 సినిమాలు ఉన్నాయి..మరికొన్ని సినిమాలను లైన్లో పెట్టుకుని ఉంది.

ఇలా మంచి మంచి ఆఫర్లతో టాప్ పోజీషన్ లో ఉన్న ఈ బ్యూటీ..రీసెంట్ గా చేసిన సీతారామమ సినిమా కూడా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి హిట్ అందుకుంది. బాలీవుడ్ లో అమ్మడు నటించిన సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. దీంతో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇలాంటి టైంలోనే డబ్బు సంపాదించుకోవాలి అనుకునింది ఏమో..ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచేసింది. కెరీర్ మొదట్లో చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ బ్యూటీ..ఇప్పుడు ఏకంగా కోటి రూపాయల పారితోషకాని పెంచేసింది.

దాదాపు ఇప్పుడు అమ్మడు ఒక్కో సినిమాకు 4 .50 లక్షలు అందుకుంటున్నట్లు సమాచారం. అమ్మడు రేంజ్ ఈస్దాయిలో మారిపోవడానికి కారణం మాత్రం పుష్ప అనే చెప్పలి. ఈ సినిమాతోనే రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ లో అవకాశాలు కొట్టేస్తుంది. ఇక ఇప్పుడు టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ..మిగత హీరోయిన్లకి గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే..రష్మిక నయన్ కన్నా ఎక్కువ పారితోషకం పుచ్చుకున్న ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు సినీ విశ్లేషకులు..!?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news