ఇప్పుడు బాక్స్ ఆఫిస్ కళ్ళని ఈ రెండు సినిమాల పైనే ఉన్నాయి. ఆగస్టు లో సినిమాలు ఎక్కువుగా రిలీజ్ అవుతున్నాయి. సెలవులు ఎక్కువుగా ఉన్నాయి అని కావచ్చు..లేక సెంటిమెంట్ గా భావించి కావచ్చు..దాదాపు 14 సినిమాలు ఈ నెలలోనే రిలీజ్ కాబోతున్నాయి. ధియేటర్స్ లోని కొన్ని రిలీజ్ అవుతుంటే..ఓటీ టీ లో మరికొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అయితే మరి కొద్ది గంటల్లో రిలీజ్ కానున్న నందమురీ హీరో బింబిసారా పై అభిమానులు ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
ఇన్నాళ్ళ కళ్యాణ్ రామ్ వేరు. బింబిసారా లో మనం చూసిన కళ్యాణ్ రామ్ వేరు. మగధ సామ్రాజ్యంలో రాజుగా ఉన్న బింబిసారుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. కేథరిన్ థెస్రా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. ఇండియన్ సినిమాల్లో తక్కువ మంది టచ్ చేసిన టైం ట్రావెల్ , హిస్టారికల్ నేపథ్యాన్ని మిక్స్ చేసి మరీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కళ్యాణ్‌రామ్ కనిపిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్లు సినిమాపై పాజిటివ్ వైబ్స్ తీసుకువచ్చాయి. మొన్న ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ అయిన రెండో ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు తారాస్థాయికి తీసుకుపోయింది.
స్టోరీ కూడా కొత్తది కావడంతో సినిమా హిట్ అయ్యే ఛాన్సులే ఎక్కువ గా ఉన్నాయి. అలాగే రేపు మరో సినిమా కూడా రిలీజ్ అవుతుంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా పై కూడా అభిమానుల అంచానాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇది ఓ సరికొత్త లవ్ స్టోరీ గా తెలుస్తుంది.
అయితే, బింబిసారా తో కంపేర్ చేస్తే..సీతా రామం కొంచెం డౌన్ టాక్ నే ఉంది అని చెప్పలి. ఓ వైపు నందమూరీ హీరో..మరో వైపు క్రియేటివ్ ప్రమోషన్స్ ..దీంతో బింబిసారా పై జనాల్లో ఎక్స్ పెక్టేషన్స్ ఎక్క్కువుగా ఉన్నాయి. ఇక లవ్ స్టోరీ లు ఇండస్ట్రీకి కొత్త కాదు..రోజుకు రెండు మూడు సినిమాలు వస్తూనే ఉంటాయి..దీంతో సీతా రామం పై హోప్స్ తక్కువుగా ఉన్నాయి. మరి చూద్దం బాక్స్ ఆఫిస్ వద్ద ఏ సినిమా విజయకేతనం ఎగరవేస్తుందో..? మీ దృష్టిలో ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారు..’సీతా రామం ‘ నా – ‘బింబిసారా” నా ..?