సినిమాల్లో సాధారణంగా.. సెంటిమెంటుకు పెద్ద పీట వేస్తారు. ముహూర్తం చూడడం నుంచి.. సినిమా షూటింగు మొదలు పెట్టేవరకు.. చివరకు ముగింపు వరకు కూడా అంతా సెంటిమెంటుతోనే సినిమాఫీల్డ్ నడుస్తుంది. అయితే.. ఇప్పుడున్నంత సెంటిమెంటు.. మాత్రం ఒకప్పుడు లేదు. అంతా కూడా.. కథ, కథనం.. హీరో… డైలాగులు.. సంగీతం మీదనే ఆధారపడేవి. అయితే.. రాను రాను.. ఈ విధానంలో అనేక మార్పులు వచ్చాయి.
ఈ క్రమంలోనే సెంటిమెంటుకు ప్రాధాన్యం ఏర్పడింది. నిజానికి అన్నగారికి సెంటిమెంటు తక్కువే. అదే విధంగా అప్పటి సినిమా నిర్మాతలకు కూడా తక్కువే. కానీ.. వరుస వైఫల్యాలు వచ్చిన నేపథ్యంలో మాత్రం దర్శకుడు విఠలాచార్య.. అన్నగారికి సెంటిమెంటును నూరిపోశారు. ముహూర్తం నుంచి విడుదల వరకు కూడా అన్నీ సెంటిమెంటు ప్రకారం జరగాలని సూచించారు. ఆ తర్వాత.. చిత్రంగా .. అన్నగారి సినిమాలు హిట్ అందుకున్నారు.
వరుస విజయాలతో దూసుకుపోయారు. అయితే.. కే. రాఘవేంద్రరావు తండ్రి.. కే.ఎస్ ప్రకాశరావు.. దర్శక త్వంలో.. అన్నగారు అనేక సినిమాలు చేశారు. ఇప్పడు రాఘవేంద్రరావు మాదిరిగానే ప్రకాశం రావుకు కూడా సెంటిమెంటు లేదు. అయితే.. అన్నగారికి మాత్రం సెంటిమెంటును ఒంట బట్టించారు. దీంతో ఆయన ప్రకాశరావు.. సినిమా షూటింగుకు ముహూర్తం పెట్టించాలని.. పట్టుబట్టారు.
కానీ, ఆయన మాత్రం ముహూర్తం కాదు.. కథలో దమ్ముండాలి! అంటూ.. అన్నగారికి సూచించేవారు. అయితే.. అన్నగారికి మాత్రం ముహూర్తం అనే మాటే ముఖ్యమయ్యేది. దీంతో దర్శకుడికి.. అన్నగారికి మధ్య వివాదం. దీంతో ఏకంగా.. షూటింగ్ వాయిదా పడిపోయింది. ఆ చిత్రమే స్త్రీ జన్మ. అయితే.. ఎట్టకేలకు షూటింగు జరిగినా.. ఎలాంటి సెంటిమెంటుకు పెద్దపీట వేయలేదు. ఇక ఆతర్వాత.. అన్నగారు.. ఆయన జోలికి పోలేదు. మొత్తానికి అన్నగారి సెంటిమెంటుకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని దర్శకుడిగా ఆయన నిలిచిపోయారు.