ప్రస్తుతం హీరోయిన్స్ అందరూ ఐటమ్ సాంగ్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం ఐటమ్ సాంగ్స్ చేయడానికి నటీమణులు ప్రత్యేకంగా ఉండేవారు. ముఖ్యంగా టాలీవుడ్ కు ఐటమ్ సాంగ్స్ ను పరిచయం చేసిన నటి జ్యోతిలక్ష్మి. ఇప్పటికీ జ్యోతిలక్ష్మి పేరు అనేక చిత్రాలలో వినిపిస్తుంది. స్టార్ హీరోలు సైతం జ్యోతిలక్ష్మి పాట సినిమాలో ఉండాలని డిమాండ్ చేసేవారంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఒకానొక టైంలో డిస్ట్రిబ్యూటర్లు స్టార్ హీరోల సినిమాలను కొనకుండా వదిలేశారు.
అదేమని అడిగితే ఖచ్చితంగా జ్యోతిలక్ష్మి పాట ఉండాల్సిందే అని పట్టుబడితే చివరకు జ్యోతిలక్ష్మి కాల్షీట్లు సంపాదించి ఆమెతో ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేసి మరీ పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అది జ్యోతిలక్ష్మి క్రేజ్. జ్యోతిలక్ష్మి చేసినవి వ్యాంప్ పాత్రలే అయినా ఆమె ఆట.. పాటా సినిమాలో ఉన్నాయంటే ప్రేక్షకులు ఎగబడేవారు. జ్యోతిలక్ష్మి రియల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు. జ్యోతిలక్ష్మి తల్లిపేరు శాంభవి కాగా తండ్రి పేరు డీకే రామానున్…వీరికి మొత్తం 8 మంది సంతానం కాగా జ్యోతిలక్ష్మి ఐదో సంతానంగా జన్మించారు. నటి జయమాలిని సైతం జ్యోతిలక్ష్మి సోదరి కావడం చెప్పకోదగ్గ విషయం.
జ్యోతిలక్ష్మి తండ్రి కూడా ఓ చిత్ర నిర్మాణ సంస్థలో పార్ట్నర్ గా ఉండేవారు. ఇక ఫ్యామిలీకి సినిమాలతో దగ్గరి సంబంధాలు ఉండటంతో జ్యోతిలక్ష్మి చిన్నవయసులోనే డ్యాన్సర్ అవ్వాలని కలలు కనేది. ఈ నేపథ్యంలోనే భరతనాట్యంతో పాటూ ఇతర నాట్య కలలను నేర్చుకుంది. కెరీర్ ప్రారంభంలో జ్యోతిలక్ష్మి హీరోయిన్ గా నటించి అలరించింది. మురపెన్ను అనే మలయాళ చిత్రంలో నటించిన జ్యోతిలక్ష్మికి జాతీయస్థాయి అవార్డు లభించింది. హీరోయిన్ గా జ్యోతి లక్ష్మి దాదాపు 30 సినిమాల్లో నటించింది. తెలుగులో పాటూ హిందీ తమిళ చిత్రాల్లోనూ నటించింది.
అయితే అప్పటి సినిమాల్లో కథకు ప్రాధాన్యత ఇస్తే వ్యాంప్ పాత్రలు ఎక్కువ వచ్చేవి. కాగా జ్యోతిలక్ష్మి రూపురేఖలకు ఎక్కువగా వ్యాంప్ పాత్రలే వచ్చేవి. ఆమెకు అలాంటి పాత్రలే వచ్చేందుకు దర్శకులు సైతం ఆసక్తిచూపేవాళ్లు. ఇదాలోకం సినిమాలో గుడి ఎనక నాసామి , ప్రేమ్ నగర్ లో లేలే నా రాజా పాటలతో పాటూ జ్యోతిలక్ష్మి స్టెప్పులు వేసిన ఎన్నో పాటలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే కెమెరామెన్ సాయి ప్రసాద్ ను జ్యోతిలక్ష్మి వివాహం చేసుకుంది. వీరిద్దరూ ముంబైలో సెటిల్ అయ్యారు. జ్యోతికి కూతురు పుట్టగా ఆమె కూడా సినిమాల్లో నటించింది. ఇక జ్యోతిలక్ష్మి 2016లో బ్లడ్ క్యాన్సర్ తో కన్నుమూసింది .